భారత ఉప రాష్ట్రపతి నేడు రాష్ట్రానికి రానున్నారు

అంతిమతీర్పు. అమరావతి. 24.8.2019


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు రాష్ట్రానికి రానున్నారు. 


నేటి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. 


ఆయనతో పాటు గవర్నర్​ బిశ్వభూషణ్​ పలువురు కేంద్రమంత్రులు విచ్చేయనున్నారు. 


ప్రముఖుల రాకతో రాష్ట్రంలో కేంద్ర బలగాలతో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


నేడు మధ్యాహ్నం 12. 40 గంటలకు చెన్నై విమాశ్రయం నుంచి ప్రత్యేక ఎయిర్​ఫోర్స్​ హెలికాప్టర్​లో ఉపరాష్ట్రపతి నెల్లూరుకు బయలుదేరుతారు.


మధ్యాహ్నం 1. 20 గంటలకు నెల్లూరు పోలీస్​ పరేడ్​ మైదానానికి చేరుకుంటారు. అటునుంచి నగరంలోని వారి నివాసానికి వెంకయ్యనాయుడు వెళ్లనున్నారు.


సాయంత్రం 3.20 గంటలకు వెంకటాచలం రైల్వేస్టేషన్​ నుంచి ప్రత్యేక రైలులో కృష్ణపట్నం- ఓబులవారిపల్లి రైల్వే లైన్​ను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కడప జిల్లా చెర్లోపల్లి రైల్వేస్టేషన్ చేరుకుంటారు. అనంతరం 5.30 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు వెంకటాచలం వెళ్లనున్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్​లో ఆ రాత్రి ఉపరాష్ట్రపతి బస చేస్తారు.


రేపు ఉదయం 9 గంటలకు ట్రస్ట్​లోని వైద్యశిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.25 గంటలకు రోడ్డు మార్గాన గూడూరు రైల్వే స్టేషన్​ చేరుకుని...విజయవాడ- గూడూరు ఇంటర్​ సిటీ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభిస్తారు.


మధ్యాహ్నం 12.15 గంటలకు నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. సాయంత్రం 3.50 గంటలకు వీపీఆర్​ ఫంక్షన్​ హాల్​లో ఏర్పాటు చేసిన అభినందన సభకు హాజరవుతారు.


తిరిగి స్వర్ణ భారత్​ ట్రస్ట్​కు చేరుకుని అక్కడే బస చేస్తారు.


ఆదివారం ఉదయం 11.30 గంటలకు కొడవలూరు మండలం బొడ్డువారిపాళెం వద్ద మిథాని అల్యూమినియం పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు.


అనంతరం నెల్లూరులోని నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్​లో విజయవాడకు బయల్దేరుతారు.


ఈ పర్యటనలో ఉపరాష్ట్రపతితో పాటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​, హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని మాజీ మంత్రి, భాజపా నేత కామినేని శ్రీనివాస్​ వెల్లడించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు