రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు కలెక్టర్ అభినందనలు

రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నమెంట్ విన్నర్స్ కు కలెక్టర్ అభినందనలు... కాకినాడ.   రాష్ట్రస్థాయి అక్రిడేషన్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్లో విన్నర్స్ గా నిలిచిన తూర్పుగోదావరి జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ రాజకుమారి అభినందించారు .  గత       నెల 29 , 30, 31 తేదీలలో గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి అక్రిడేషన్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ లో 13 జిల్లాల నుండి 15   జట్లు పోటీపడగా చిత్తూరు జిల్లా పై తూర్పు గోదావరి జిల్లా విన్నర్స్ గా నిలిచి  ట్రోపి తో పా టు 50 వేలు  నగదు బహుమతి అందుకున్నారు . సోమవారం స్పందన హాల్లో విన్నర్స్ గా నిలిచిన జిల్లా జట్టు మేనేజర్  వి నవీన్ రాజ్, సభ్యులు కృష్ణంరాజు, రంగరాయ మెడికల్ కాలేజ్ పి డి, కోచ్ స్పర్జన్ రాజు, వంశీ, డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్ తో కలిసి ట్రోపి ని కలెక్టర్ మురళీధర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో జర్నలిస్టులు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో లో మరిన్ని పథకాలు సాధించి రాష్ట్రస్థాయిలో జిల్లా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నారు. దీనికి కావలసిన ప్రోత్సాహకాన్ని నా నుండి సంపూర్ణ మద్దతు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో ఏ పి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి ధర్మరాజు, మంతెన వాసు, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు