గులాబీలతో చంద్రబాబును అభినందించిన కాలేజి విద్యార్ధినులు

గులాబీలతో చంద్రబాబును అభినందించిన కాలేజి విద్యార్ధినులు
-హైటెక్ సిటి రూపశిల్పికి  అభినందనలు
-20ఏళ్లు పూర్తైన సందర్భంగా చంద్రబాబే తమకు స్ఫూర్తి అన్న బాలికలు
గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబుకు గులాబీల అభినందనలు తెలిపిన కాలేజి విద్యార్ధినులు. హైటెక్ సిటి నిర్మాణం పూర్తై 20ఏళ్లు అయిన సందర్భంగా గులాబీలతో అభినందనలు తెలిపిన  బాలికలు. 
జెకెసి కళాశాల విద్యార్ధినులంతా గుంటూరు పార్టీ కార్యాలయానికి వచ్చి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ''మిమ్మల్ని కలవడం ఎంతో ఆనందంగా ఉంది, మీరే మాకు స్ఫూర్తిగా'' పేర్కొన్న విద్యార్ధినులు. 
చంద్రబాబు మాట్లాడుతూ, ''అమరావతిని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ది చేయాలని ఆకాంక్షించాను. హైటెక్ సిటిని మించిన సిటీలు రాష్ట్రంలో అభివృద్ది చేయాలని అనుకున్నాం. ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధి చేశాం. ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. రాష్ట్రాన్ని రివర్స్ చేశారు, అభివృద్ది అంతా తారుమారు అయ్యింది. గత 5ఏళ్లలో వచ్చిన అనేక సంస్థలు ఇప్పుడు వెనక్కి పోతున్నాయి. గవర్నమెంట్ టెర్రరిజం తట్టుకోలేక పోతున్నామని పారిశ్రామిక వేత్తలే పేర్కొంటున్నారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ అప్రదిష్ట పాలు కావడం ఆవేదన కలిగిస్తోంది. అభివృద్ధి ఫలాలు మీకు అందేసరికి అంతా తారుమారైంది. దీనిపై రాష్ట్రంలో యువత ఆలోచించాలి. జరిగిన నష్టాన్ని గుర్తించాలి. భవిష్యత్తుపై ఆశతో ముందడుగేయాలి. కష్టపడి చదవాలి, పట్టుదలగా ముందుకు సాగాలి, అత్యున్నత భవిష్యత్తువైపు అడుగేయాలి, తల్లిదండ్రుల ఆశలను సఫలం చేయాలి'' అని ఆకాంక్షించారు.
చంద్రబాబును కలిసినవారిలో భార్గవి, నాగలక్ష్మి,సుప్రియ,గౌతమి,భవాని,బ్రహ్మణి,మేఘన,ప్రమీల తదితరులు ఉన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు