ప్రభుత్వంపై నిందలు వేస్తే సహించేది లేదు: మంత్రి


గుంటూరు :  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే యువతకు 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మంగళవారం ఆయన గుంటూరు జిల్లాల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో జలకళ ఉట్టి పడుతోందని, రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. సమర్థవంతమైన వైఎస్‌ జగన్‌ పాలన చూసి చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని, దీనిలో భాగంగనే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎక్కడ తన ఉనికిని కోల్పోతానో అన్న భయంలో చంద్రబాబుతో సహా టీడీపీ నేతలంతా ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వరద రాజకీయాలకు తెరలేపారని, అవి ఫెయిల్‌ అయిన తరువాత హత్యా రాజకీయాలను ముందుకు తెస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి వెంకటరమణ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ హత్యలు, కక్ష సారింపు చర్యలు ఉండేవని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకున్న ఘనత టీడీపీ నాయకులదని అన్నారు.  తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర  వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులోకి వచ్చాయని మంత్రి తెలియజేశారు.  టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు చెందిన అక్రమ మైనింగ్‌పై కోర్డు ప్రశ్నిస్తే బాధ్యత ప్రభుత్వానికి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కోడెల కుటుంబం చేసిన అక్రమాల వల్ల బలైన బాధితులు కోర్టులను, పోలీసులను ఆశ్రయిస్తే దానికి తమని నిందించడం సరికాద్దన్నారు.  అనినీతి లేకుండా సంక్షేమం దిశగా తమ ప్రభుత్వం ముందడుగులు వేస్తోందని, కావాలని తమపై నిందలు వేస్తే సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు