ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత..........

 



సినీ గీత రచయిత ముత్తు విజయన్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కవయిత్రి తేన్‌మొళిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ముత్తు. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. దీంతో ముత్తు స్థానిక వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘ కార్యాలయంలో బస చేస్తున్నారు.


ఈ క్రమంలో ఆయన పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ముత్తు విజయన్ శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కన్నుమూశారు. అదే రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిపించారు.  


పలువురు ప్రముఖ నటుల చిత్రాలకు పాటలు రాసిన ముత్తు  విజయన్.. స్టార్ హీరో విజయ్ నటించిన ' తుళ్లాద మనం తుళ్లుం' అనే సినిమా ద్వారా గీత రచయితగా పరిచయమయ్యారు. అందులో  మెఘామాయ్‌ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్‌ పాటలు ముత్తువిజయన్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.


ఆ తరువాత పెన్నిన్‌మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్‌ పాట ముత్తువిజయన్‌ కి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. ఎనిమిది వందలకు పైగా పాటలు రాసిన ముత్తు కొన్ని సినిమాలకు  మాటల రచయితగా కూడా పని చేశారు. అలానే సహాయ దర్శకుడిగా కూడా తన టాలెంట్ చూపించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు