వైసిపి నేతలపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు

ప్రజాస్వామ్యాన్ని, పార్టీలను లేకుండా చేయడమే సీఎం జగన్ దురాలోచన
వైసిపి నేతలపై ధ్వజమెత్తిన యనమల రామకృష్ణుడు
''ఛలో ఆత్మకూరు'' నిరసనల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు: యనమల
 నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని టిడిపి నేతలు, శ్రేణులు ప్రదర్శించాయి. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా చూపాలి, రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. 
ప్రజాస్వామ్యాన్ని, పార్టీలను లేకుండా చేయాలన్నదే సీఎం జగన్ దురాలోచన.
తన పాలనను ప్రజలు ప్రశంసిస్తున్నారని జగన్ చెప్పడం హాస్యాస్పదం. 6నెలల్లో మంచి సీఎం అనిపించుకుంటా అనిచెప్పి ఇంతకన్నా చెడ్డ సీఎం లేడని పేరొందారు.
అప్పుడు హిట్లర్ ను గోబెల్స్ ముంచేశాడు. ఇప్పుడు జగన్ ను సాక్షి మీడియా ముంచేస్తుంది. జీవనోపాధి కోల్పోయి లక్షలాది జనం రోడ్డున పడ్డారు. ఇసుక కొరతతో నిర్మాణ పనులన్నీ స్థంభించిపోయాయి. గోదావరి, కృష్ణా వరద బాధితులను ఆదుకునే చర్యలు లేవు. లక్షలాది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలను చావుదెబ్బతీశారు.  ఇన్ని నిర్వాకాలు చేసినందుకా ప్రజలు జగన్ ను ప్రశంసించేది..?
అమరావతి అభివృద్దికి నిధులు లేవని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. విదేశీ పర్యటనల్లో కూడా ఏపి ప్రతిష్ట పెంచే చర్యలు చేపట్టకుండా, పెట్టుబడులు అడ్డుకునేలా వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. అమరావతికి నిధులు లేవు అనడం వైసిపి ప్రభుత్వ విధానాన్ని స్పష్టం చేసింది. అమరావతిని అభివృద్ది చేయమని ఆర్ధికమంత్రే చెప్పడం వైసిపి తిరోగమనం. 
అభివృద్ది వికేంద్రీకరణ చేస్తామని చెప్పడం కొత్తదేమీ కాదు. టిడిపి పాలనలో జరిగింది అభివృద్ది వికేంద్రీకరణే. కరవు సీమ అనంతపురానికి నీళ్లు ఇచ్చామన్నా, కియా పరిశ్రమ తెచ్చామన్నా, ప్రకాశంలో పరిశ్రమలు తెచ్చామన్నా, విశాఖలో ఐటి హబ్ అభివృద్ది చేశామన్నా, అన్నీ టిడిపి అభివృద్ది వికేంద్రీకరణలో భాగాలే..
అమరావతిని అభివృద్ది చేయలేమని బుగ్గన చేతులెత్తేశారు. సింగపూర్ వెళ్లి ఏపి ప్రతిష్ట దెబ్బతీసే వ్యాఖ్యలు గర్హనీయం. వరల్డ్ బ్యాంకు, ఏసియన్ బ్యాంకు రుణాలు పోగొట్టింది మీరుకాదా..? ఇప్పుడు అమరావతికి నిధులు లేవని చేతులెత్తేస్తారా..? ఇంతకన్నా దివాలాకోరుతనం ఏముంటుంది..? 
టిడిపి ప్రభుత్వం అటు అమరావతిని, ఇటు 13జిల్లాల అభివృద్దిని సమ ప్రాధాన్యతతో అభివృద్ది చేసినప్పుడు వైసిపి ప్రభుత్వం ఎందుకని చేయలేక పోతోంది..? అభివృద్దిని గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులకే వైసిపి నేతలు ప్రాధాన్యం ఇవ్వడం వల్లే గత 110రోజుల్లో ఈ దుష్పలితాలు.
చంద్రబాబు నిర్బంధంపై డిజిపి సవాంగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు పెరుగుతాయని మాజీ సీఎం ఇంటి గేట్లకు తాళ్లు కట్టామని సమర్ధిస్తున్నారా..? మాజీ సీఎంను 45ని. కారులోనే నిర్బంధించామని డిజిపి చెబుతున్నారా..? ప్రశాంతంగా, శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలను పోలీసు బలగాలతో అణిచేయాలని చూశారు. 
సెక్షన్ 144, సెక్షన్ 30 లేనిచోట్ల టిడిపి నేతలను ఎలా నిర్బంధిస్తారు..?  నోటిసులు ఇవ్వకుండా హవుస్ అరెస్ట్ లు ఎలా చేస్తారు..? రోజు కూలీకి వెళ్లే కూలీలను ఆటోల్లో నుంచి దింపి ఇళ్లకు పంపేయడం ఏమిటి..? పెళ్లికి వచ్చిన వాళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం ఏమిటి..? 
ఇవన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలు కాదా..? మానవ హక్కులను ఉల్లంఘించింది వైసిపి ప్రభుత్వమే కాదా...? మాజీ సీఎం చంద్రబాబును 12గం అక్రమ నిర్బంధంలో ఉంచడం, అదేమని ప్రశ్నిస్తే రాత్రి 7.30గం కు ఇంటికి నోటీసు అంటించడం, టిడిపి నేతల అక్రమ అరెస్ట్ లు అన్నీ మానవ హక్కుల ఉల్లంఘనలే..
వీటన్నింటికి వైసిపి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలి.
ప్రజాస్వామ్య వాదులు, ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఒక్కతాటిపైకి రావాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. మేధావులు, అభ్యుదయ వాదులంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి.
యనమల రామకృష్ణుడు
శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image