చంద్రబాబుతో గుంటూరు టిడిపి నేతలు భేటీ. జీవి ఆంజనేయులు, ఎమ్మెల్లేలు సత్య ప్రసాద్, మద్దాలి గిరి, నిమ్మకాయల చినరాజప్ప, డొక్కా మాణిక్యవర ప్రసాద్, ఆనంద్ బాబు,ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు
• Tdp డిమాండ్
1).ప్రతి బాధిత కుటుంబానికి రూ.లక్ష ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.
2). ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలి.
3).బీళ్లు పెట్టిన భూములకు పరిహారం ఇవ్వాలి. ఈ ఏడాది పంట కోల్పోయిన బాధిత రైతులకు కవుళ్లు చెల్లించాలి.
4).బాధిత గ్రామాల్లో పికెట్లు ఏర్పాటు చేయాలి, పోలీసు పహరా పెంచాలి.
5). పెట్రోలింగ్ బృందాలను పెంచాలి, సిసి కెమెరాలతో భద్రత కల్పించాలి.
6). నిందితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలి.
7). రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి.
8).ఎక్కడ ఏ స్వల్ప ఘర్షణ జరిగినా వెన్వెంటనే స్పందించాలి.
9).ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయని చోట్ల వెంటనే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయాలి
10).ఫిర్యాదులు తీసుకోకుండా, కేసులు నమోదు చేయకుండా బాధితుల పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అధికారులను వెంటనే బదిలీ చేయాలి. వారిపై యాక్షన్ తీసుకోవాలి.
11).వేధింపులకు గురిచేసి, తొలగించిన అంగన్ వాడి, నరేగా ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ ఎంలు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను, చౌకడిపో డీలర్లను వెంటనే నియమించాలి.
12).బాధితులు అందరికీ న్యాయం చేయాలి.
13). బాధితులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తేయాలి. భవిష్యత్తుపై తప్పుడు కేసులు పెట్టకూడదు.
14).సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు ఎత్తేయాలి.
15).అక్రమంగా పెట్టిన ఎస్సీ,ఎస్టీ కేసులు తొలగించాలి.
16). వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి.