జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేలు

జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేలు
కొత్తగా లా చదివిన వారికి తొలి మూడేళ్ల పాటు సాయం
అమరావతి : మరో ఎన్నికల హామీ అమలుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జూనియర్‌ లాయర్ల (అడ్వకేట్‌)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 'వైఎస్సార్‌ లా నేస్తం' పథకం అమలుకు ఉత్తర్వులిచ్చింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. 'వైఎస్సార్‌ లా నేస్తం' ప్రకారం కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు.. అంటే మూడేళ్ల పాటు నెలకు రూ.5000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్‌ 3వ తేదీన ఈ పథకం ప్రారంభం కానుంది.
ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలు..
దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పొంది ఉండాలి.
దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.
న్యాయవాద చట్టం 1961 సెక్షన్‌ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
జీవో జారీ అయ్యే నాటికి జూనియర్‌ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు.
15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్‌ న్యాయవాదులు లేదా సంబంధిత బార్‌ అసోసియేషన్‌ నుంచి ధృవీకరణ పత్రంతో  ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్‌ అడ్వకేట్స్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి.
న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్‌ కౌన్సిల్‌లో ఉంచాలి.
కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు.
కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్‌ పిల్లలు.
ప్రతి దరఖాస్తు దారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
జీవో జారీ చేసేనాటికి జూనియర్‌ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
జూనియర్‌ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
నాన్‌ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
అర్హులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి.
సీనియర్‌ న్యాయవాది ధృవీకరణతో బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు అఫిడవిట్‌ అప్‌లోడ్‌ చేయాలి.
దరఖాస్తుతో పాటు ఆధార్‌ నంబర్‌ను పొందుపరచాలి.
దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image