తిరుపతి, నవంబర్ 19: అధికారులు ఒకరికొకరు సమన్వయంతో పనిచేసి నిడ్జామ్ క్రీడల విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో తిరుపతి ఎస్.వి యూనివర్సిటీలోని తారకరామ స్టేడియంలో 17 వ జాతీయ అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్ మీట్ ( నిడ్జామ్ ) క్రీడలు జరగనున్న నేపథ్యంలో నేడు పిడి లు, పిఈటి లు, అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంకు హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 23, 24, 25 తేదీలలో ఎస్.వి.యూనివర్సిటీ తారకరామ స్టేడియంలలో 17 వ జాతీయ అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్ మీట్ ( నిడ్జామ్ ) క్రీడలు జరగనున్నదన్నారు. ఈ రోజు నుండి అధికారులందరికీ నిడ్జామ్ కు సంబంధించిన పనులు ప్రారంభమయ్యిందన్నారు. నిడ్జామ్ కు సంబంధించి నేటి నుండి వారం రోజుల పాటు అధికారులు పూర్తి స్థాయిలో వారికి కేటాయించిన పనులు నిర్వహిస్తుండాలన్నారు. వెన్యూస్ కు ఇంచార్జ్ లు గా నియమించిన అధికారులతో పిఈటి లు టచ్ లో ఉండాలని తెలిపారు. డిఆర్డిఏ, హౌసింగ్ పిడి లు రిసెప్షన్ చూస్తారని, ఈ రిసెప్షన్ కు సంబంధించిన కౌంటర్లు అన్నీ సిద్ధంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి 12 వెన్యూలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క లొకేషన్ కు డాక్టర్లను, ఏఎన్ఎం లను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశం ప్రకారం క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులకు వారి వారి వెన్యూలలో బెడ్, పిల్లో, బకెట్లు, మగ్ లు, తదితర సౌకర్యాలు కల్పించనున్నామని వివరించారు. ఒక్కొక్క వెన్యూకు సెల్ చార్జర్ పాయింట్ ఉంటుందని అలాగే స్పొర్ట్స్ జరిగే లొకేషన్లలో కూడా సెల్ చార్జర్ బోర్డులు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులకు తిరుపతిలోని పద్మావతి నిలయం, తదితర లొకేషన్లలో బస సౌకర్యం కల్పించడం జరిగిందని, ఈ ప్రాంతంలో లిక్కర్ కానీ, సిగరెట్ లను నిషేదించడమైనదన్నారు. వెన్యూల వద్ద మస్కిటో కాయిల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 21 నుండి లంచ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందని, ఈ లంచ్ కు సంబంధించిన ఫుడ్ కౌంటర్లను సిద్ధం చేయాలన్నారు. తారకరామ స్టేడియంలో క్రీడలకు సంబంధించిన పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో ఫుడ్ కూపన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, అధికారులకు ఏదైతే విధులు కేటాయించామో ఆ విధులను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు.
తిరుపతి నియోజకవర్గ శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ నిడ్జామ్ క్రీడలను ఒక యజ్ఞం లాగా చేపట్టి విజయవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. గత సంవత్సరం నిడ్జామ్ క్రీడలను సమర్థవంతంగా నిర్వహించడం వలనే ఈసారి మరలా మన తిరుపతికే నిడ్జామ్ క్రీడలను కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఎంతో శ్రమతో కూడుకున్నదని, అధికారులు ఒకరికొరితో సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. నిడ్జామ్ క్రీడలను విజయవంతం చేసి తిరుపతి పట్టణానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు.
జె సి 2 చంద్రమౌళి మాట్లాడుతూ అధికారులకు ఏదైతే విధులు కేటాయించామో ఈ రోజే ఆ వెన్యూలకు వెళ్ళి పరిశీలించి రావాలని అప్పుడు అధికారులకు వెన్యూల పై ఒక అవగాహన వస్తుందన్నారు. ఒక రోజు ముందుగానే విధులకు రిపోర్ట్ చేయాలన్నారు. వెన్యూలలో బ్రేక్ ఫాస్ట్, డిన్నర్ ఉంటుందని అలాగే స్టేడియంలో లంచ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడాకారులను ఎస్.వి. యూనివర్సిటీకి తీసుకువచ్చి వారికి ఫిజికల్ ఫిట్నెస్ చేయించి అలాగే ఐడి కార్డులు అందజేసిన అనంతరం వీరిని వెన్యూలకు అధికారులు తీసుకువెళ్లాలన్నారు. నైట్ షిఫ్ట్ లో విధులు నిర్వహించే అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ నెల 21 నుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఉచితంగా భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రోజు వెన్యూలకు ఉదయం 6 గం.ల కల్లా బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం 6 గం.లకు డిన్నర్ రావలసి ఉంటుందన్నారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బంది వారికి ఏ వెన్యూలు అయితే కేటాయించామో ఆ వెన్యూల వద్దే ఉండాలన్నారు. డిటిసి బసిరెడ్డి మాట్లాడుతూ నిడ్జామ్ క్రీడల ఏర్పాట్లలో భాగంగా 138 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్లు అలాగే, తిరుపతి ఆర్టిసి బస్ స్టాండ్ వద్ద బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్ పోర్ట్ కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు తలెత్తితే సెల్ ఫోన్ నెం: 9848171101 కు ఫోన్ చేసి సంప్రదిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. సెట్విన్ సిఇఓ లక్ష్మి మాట్లాడుతూ నిడ్జామ్ క్రీడలకు సంబందించి అధికారులకు ఏదైతే విధులను కేటాయించామో ఆ విధులను అధికారులు తూచా తప్పకుండా నిర్వహించి నిడ్జామ్ క్రీడలను విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో శిక్షణా కలెక్టర్ పృథ్వీ తేజ్, తిరుపతి ఆర్డిఓ కనక నరసా రెడ్డి, తహశీల్దార్లు, ఏంపిడిఓ లు, వివిధ కమిటీల ఇంచార్జ్ అధికారులు, పిడి లు, పిఈటి లు, తదితరులు పాల్గొన్నారు.
---
నిడ్జామ్ క్రీడల విజయవంతానికి కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా