దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి*

*దీప దానం ఎలా చేయాలి* *****, *ఎప్పుడు చేయాలి* *వెలిగించి చేయాలా లేక అలానే **చేయాలా అని తెలియని* *వారు చాలా మంది* *ఉంటారు దానికి సంబంధించిన* వివరణ............
వరంగల్ న్యూస్ నవంబర్10 . guptha


  ఏ మాసంలోనైనా మంచి రోజున దీప దానం చేయవచ్చు.
కార్తీక మాసంలో ఇచ్చే దీప దానం విశేష ఫలితాలను ఇస్తుంది. ఎందుకనగా కార్తీక మాసపు నామం (పేరు) కృత్తికా నక్షత్రం వలన వచ్చినది. కృత్తికా నక్షత్రం  (అగ్ని)  పూర్వక నక్షత్రం. 
అందువలన కార్తీక మాసపు క్షీరాబ్ధి *ద్వాదశి* లేదా *పూర్ణిమ* రోజున అయితే ఉత్తమం లేదా మంచి రోజులలో కూడా దీపదానం చేయవచ్చు.దీపము జ్ఞానానికి, సంకేతముగా,  పరం బ్రహ్మ స్వరూపంగా చెపుతారు. అనగా మనలో వున్న అజ్ఞానం అనే అంధకారాన్ని తుడిచి వేసి, జ్ఞానమనే వెలుతురును ప్రసాదించేదిగా   అర్థం.
ఇక దీప దానం ఎలా చెయ్యాలంటే,.   స్థోమత వుంటే,   వెండి ప్రమిదలు లేదా ఇత్తడి.  లేక బియ్యం పిండి.    లేదా గోధుమ పిండి   లేదా చివరకు మట్టి ప్రమిదలు కల ( కనీసం రెండు దీపాలు వుంటే ఉత్తమం) దీప దానం.  చేయాలి. స్టీలు.  దీపాలు అంత శ్రేష్టము కాదు.  పిండి తో చేసే  దీపాలు  అయితే ఆపిండి శుచి శుభ్రముగా వుండాలి.    పిండిని, ఆవుపాలతో  తడిపి చేసిన  ప్రమిదలయితే చాలా మంచివి, ఈవిధంగాఇస్తూ సంభావనతో సమర్పయామి అని నమస్కరించాలి. దీపదానం విష్ణు సంబంధమైన దేవాలయములలో    కాని శివుని దేవాలయములలో.     కాని లేదా లోకానికి వెలుగునిచ్చే *సూర్యాలయంలో* అయితే ఇంకామంచిది. మొదట ఆ దీపములను ఒక పళ్ళెములో వుంచి, నెయ్యి లేదా నూగుల నూనె వేసి, ఆ తరువాత ఒక్కొక్క దీపంలో రెండు వత్తులు వేసి,  దీపములను భక్తి తో వెలిగించి, పసుపు, కుంకుమలు మరియు పుష్పలతో అలంకరించి, వాటికి ధ్యాన  శ్లోకముతో నమస్కారము సమర్పించి వాటిని ఒక బ్రాహ్మణునకు, సాయంత్రం  వేళ 5.30 నుంచి 7.00 గంటల సమయం లోపల *సదక్షిణ తాంబూలములతో దానం* *చేయాలి* .  సంకల్ప పూర్వకముగా దానం చేస్తే ఇంకా మంచిది.
శ్లోకము ను చదివలెను
*సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం*
*దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ* 
అనే మంత్రాన్ని మనస్సులో ధ్యానించి దానం చేయాలి.
                                      అనగా, సర్వ జ్ఞానస్వరూపమైన, సర్వ సంపదలు, ఐహిక సుఖాలనొసగే, దీపమును దానమిచ్చుచున్నాను, దీనివలన  నాకు శాంతిని ప్రసాదించుగాక అని అర్థం.
       ఇలా స్త్రీలుగాని, పురుషులు గానీ దీపముల దానం చేస్తే విద్య, దీర్ఘాయువు, స్వర్గప్రాప్తి లభిస్తుంది. 
       దీపము దానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు కుటుంబ దోషములు కూడా  తొలగిపోతాయి.
స్వచ్ఛమైన   నువ్వుల నూనె కాని, నెయ్యికాని దేవాలయములలో  దీపారాధన చేయడానికి దానంగా కూడా ఇవ్వచ్చు. దానికి తగిన ఫలితము వస్తుంది. కార్తీక మాసంలో పత్తిని చక్కగా తీసుకొని వత్తి చేసి  బంగారం   లేదా వెండి   ప్రమిదలో  నెయ్యి పోసి దీపం వెలిగించి  ఆ దీపాన్ని పురోహితునికి.        దానం చెయ్యాలి. ఇదేవిధంగా నెలంతా దానం ఇచ్చి నెలాఖరున వెండి ప్రమిదలో  పసుపునుపూసిన వత్తితో  దీపం వెలిగించి దానిని   బ్రాహ్మణునికి దానం చేయండి. ఆపై బ్రాహ్మణునికి ఒక కుటుంబమునకు సరిపడా *బియ్యము,కందిపప్పు,బెల్లము,ఆవునెయ్యి,ఆకుకూరలు,కూరగాయలు,ఉప్పు, సంభావనతో* స్వయంపాకం  సమర్పించడం ద్వారా. దీపాన్ని వెలిగించి చేసేటప్పుడు....భక్తి తో పాటు తృప్తి ఉంటుంది .....