విద్యార్థులకు ప్లేట్లు- బిస్కెట్లు పంపిణీ
రాపురు నవంబర్ 16,(అంతిమతీర్పు):
సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వ్యవస్థాపక అధ్యక్షులు రేవూరు వెంకటస్వామి తండ్రి దివంగత రేవూరు నారయ్య రెండవ వర్దంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. రాపూరు పట్టణంలోని దళితవాడ పాఠశాలల్లోని విద్యార్థులకు 60 ప్లేట్లు, బిస్కెట్లును విద్యార్థులకు వైఎస్ఆర్సిపి యువజన విభాగం నాయకులు రేవూరు రామచంద్రయ్య పంపిణీ చేశారు. ఈసందర్బంగా రేవూరు. రామచంద్రయ్య మాట్లాడుతూ తన పినతండ్రి రేవూరు. నారయ్య రెండవ వర్ధంతిని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ప్లేట్లు, బిస్కెట్లను చేయడం జరిగిందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ రేవూరు వెంకటస్వామి మాట్లాడుతూ తన తండ్రి స్వర్గియా రేవూరు నారయ్య జ్ఞాపకార్థం ఆయనకు ఇష్టమైన పాఠశాలలోని పిల్లలకు ప్లేట్లు, బిస్కెట్స్ ను ఇవ్వండి జరిగిందన్నారు. అలాగే ప్రతి ఏడాది తన తండ్రి పేరుమీద పిల్లలకు ఏదోఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలోని 60మంది బాలబాలికలకు ప్లేట్లు, బిస్కెట్లును ఇచ్చామన్నారు. అదేవిధంగా పిల్లలు చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు పట్లా ప్రేమ, గౌరవం, అలవర్చుకోవాలి అని అన్నారు.