స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను  కలిపారు

స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను  కలిపారు


శబరిమలై ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా  సౌకర్యంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి...


తిరువనంతపురం సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి


*దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు కేరళ సీఎం ప్రత్యేక అభినందనలు *


తిరువనంతపురం :
05 -11-2019


స్వామి అయ్యప్ప ఐదు రాష్ట్రాలను కలిపారని, అయ్యప్ప భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టడం పై తిరువంతపురం సమావేశంలో చర్చించడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు...


ముఖ్యంగా అయ్యప్ప భక్తులు ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ వాడకం పూర్తిగా తగ్గించాలని,  కేరళలో ప్లాస్టిక్ నిషేధం అమలు జరుగుతుందన్నారు...


ఈ సమావేశం ద్వారా కేరళ సీఎం ఐదు రాష్ట్రాల అయ్యప్ప భక్తులను ప్లాస్టిక్ నిషేధం కు సహకరించాలని కోరారు అని తెలిపారు...


కేరళ సీఎం ఆహ్వానం మేరకు  ఈరోజు తిరువనంతపురంలో జరిగే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు దేవదాయ శాఖ మంత్రులు సమావేశానికి ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నట్లు తెలిపారు...


ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అయ్యప్ప స్వాములు కోసం శబరిమలైలో  కొండపైన, కొండ దిగువన అతిథి గృహం, వసతి నిర్మాణానికి కేరళ ప్రభుత్వాన్ని స్థలం కేటాయించమని కోరినట్లు ఈ సందర్భంగా గుర్తుచేశారు. 


శబరిమలలోని శ్రీధర్మశాస్త దేవాలయంలో నవంబరు 17 నుంచి మండల, మకరవిల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పన, ఇతర అంశాలపై చర్చించేందకు కేరళ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేవాదాయశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించింది అన్నారు.


సమావేశంలో కేరళ సీఎం పినరయి విజయన్ మరియు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కటకం సురేందర్ కు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు ప్రతిపాదించిన అంశాలు 


అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం పంబ సన్నిధిలో టోల్ ఫ్రీ సర్వీస్ ఏర్పాటు చెయ్యాలి.


రాష్ట్ర పోలీసులు మరియు అధికారులతో  కలిపి నీలకంఠ, పంబ బేస్ క్యాంప్ వద్ద శబరిమల సమాచార వ్యవస్థ తో  పాటు తెలుగు అయ్యప్పలు సమాచారం ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలి...


పంబ మార్గములో ప్రయాణించే బస్సు బోర్డులపై పెద్దగా స్పష్టంగా తెలుగు భాషలో ఏర్పాటు చేయాలి...


నీలకంఠ, పంబ సన్నిధి వద్ద అయ్యప్ప భక్తులు కు తాగునీరు భోజన అల్పాహార కేంద్రాలను విశ్రాంతి తీసుకునే ఏర్పాటు చేయాలి.


అదనంగా ప్రత్యేక రైలు ఏర్పాటు చేయాలి కోరినట్లు తెలిపారు...


 సమావేశంలో కేరళ సీఎం స్పందిస్తూ ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల హెల్ప్ డెస్క్ కు అనుసంధానిస్తూ  కేరళ లో  జాయింట్ గా ఐదు రాష్ట్రాల తో కలిపి సెంట్రల్ హెల్ప్ సెంటర్ను  ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నార..


అనంతరం కేరళ సీఎం ను సమావేశానికి వచ్చిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులను మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కనకదుర్గ అమ్మవారి ప్రసాదము అందజేసి వారిని సన్మానించిన ట్లు తెలిపారు ....


సమావేశం అనంతరం అనంత పద్మనాభ స్వామి వారిని దేవదాయ శాఖ మంత్రి దర్శించుకుని ఆశీర్వాదములు తీసుకున్నారు....


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు