వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..

తేది 02-11-2019

వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..
మంత్రి అవంతి శ్రీనివాస్‌ రాజీనామాకు సిద్ధమా.?
                                - మంతెన సత్యనారాయణ రాజు
    తెలుగుదేశం పేరు వింటేనే మంత్రి అవంతి శ్రీనివాస్‌కు నిద్ర కరువవుతోంది.  వైసీపీ నేతల ఇసుక అక్రమాలను పత్రికా ముఖంగా నిరూపిస్తా. మీడియా ముందు రాజీనామా సవాల్‌ విసిరిన మంత్రి అవంతికి.. వాస్తవ పరిస్థితులపై చర్చించే ధైర్యం ఉందా.? నాలుగు గోడల మధ్య కాదు. మీ సొంత జిల్లా విశాఖలో ఇసుక కొరతతో నిలిచిపోయిన వందలాది భవనాలు మీకు కనిపించడం లేదా.? చెన్నై, బెంగళూరు, చెన్నైకి లారీ రూ.లక్ష చొప్పున తరలిస్తున్న విషయం మీకు తెలియదా.? ప్రజాక్షేత్రంలోకి రండి. బయటకొచ్చి ఇసుకతో ప్రజలు పడుతున్న కష్టాలు చూడండి. ఎనిమిది మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక కుటుంబాలను పస్తులుంచలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనికి వైసీపీ ఇసుక మాఫియా కారణం కాదా.? కడప జిల్లా సిద్ధవటం మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిని వైసీపీ నేతలు ట్రాక్టర్‌తో ఢీకొట్టించారు. ఘటనలో వీఆర్‌ఓ ఆరిఫ్‌, వీఆర్‌ఏ వెంకటపతి గాయపడడం నిజం కాదా.? నిన్నటికి నిన్న కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తొట్లవల్లూరులోని గరికపర్రు గ్రామ వాలంటీర్‌ అర్ధరాత్రి వేళ రూ.1500 నుండి రూ.2వేలు వసూలు చేసి ఎడ్ల బండిలో ఇసుక తరలిస్తుంటే గ్రామస్థులు అడ్డుకోగా స్థానిక నేత పేరు చెప్పి బెదిరించడం వాస్తవం కాదా.? వీటన్నింటిపై మంత్రి అవంతి చర్చకు సిద్ధమైతే.. ప్లేస్‌ చెప్పండి. అక్రమాలు జరగలేదని చెప్పే ధైర్యం ఉంటే రాజీనామా లేఖతో చర్చకు రండి.
                                    Sd/-
                                మంతెన సత్యనారాయణ రాజు
                                శాసన మండలి సభ్యులు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బ్రహ్మంగారి బోధనలు చిరస్మరణీయం: చంద్రబాబు -327వ ఆరాధనా ఉత్సవాలు నేడు ఇళ్లలోనే జరుపుకోవాలి
Image
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాను కలిసి ఫిర్యాదు చేసిన వైయస్ఆర్ కాంగ్రెెస్ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి. విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత శ్రీ మిథున్ రెడ్డి, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు, శ్రీ మార్గాని భరత్..
Image
ప్రపంచ పత్రిక దినోత్సవ శుభాకాంక్షలు : ఆ.ప్ర కాంగ్రెస్ కో -ఆర్డినషన్ కమిటీ సభ్యులు శ్రీమతి సుంకర పద్మశ్రీ.
Image
అఖిల భారత వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కాల్ సెంటర్ నంబర్లు 18001804200 మరియు 14488
Image