Nara Chandrababu Naidu tweet:

Sri Nara Chandrababu Naidu tweet:


భారత ప్రజాస్వామ్య పరిరక్షణలో, భారతీయుల ఆకాంక్షలను ప్రతిఫలింపచేయడంలో బాధ్యతాయుత పాత్రను పోషిస్తున్నాయి పత్రికలు, ప్రసార మాధ్యమాలు. ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పత్రికాధిపతులకు, పాత్రికేయులకు, పత్రికా రంగంలో సేవలందిస్తోన్న ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు. 


ఎన్టీఆర్ హయాం నుంచీ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుంది. అందులో భాగంగానే జీవో 938కు, 2430కు వ్యతిరేకంగా పోరాడుతోంది. 


స్వేఛ్ఛగా, నిర్భయంగా తమ విధులను నిర్వర్తించే పత్రికల రెక్కలు కట్టేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన జీవో 2430ను రద్దు చేసి, భావ ప్రకటనా హక్కును పరిరక్షించాల్సిందిగా  ఈ పత్రికా దినోత్సవ సందర్భంగా నేను వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.