*హరిహర పుత్ర అయ్యప్ప సన్నిధిలో భారీ అన్నదానం* వింజమూరు: వింజమూరులోని ఫోస్టాఫీసు వీధిలో ఉన్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి సన్నిధానంలో బుధవారం నాడు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డే. మాల్యాద్రి జ్ఞాపకార్ధం ఆయన భార్య రమణమ్మ సౌజన్యంతో బ్రహ్మయ్య, పర బ్రహ్మయ్య, ప్రసాద్, అన్నపూర్ణేశ్వరిలు ఈ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ హరిహర పుత్ర దేవస్థానం ఫౌండేషన్ నిర్వాహకులు చేబ్రోలు. వసంతరావు మాట్లాడుతూ వింజమూరులో భక్తుల మన్ననలు పొందిన ఈ దేవస్థానంలో ప్రతి యేడాది విశేషంగా భక్తులు అయ్యప్ప మాలధారలను ధరించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. ఇందులో భాగంగా కార్తీక మాసంలో అన్నదానం చేసేందుకు పలువురు స్వచ్చందంగా ముందుకు రావడం ఆ అయ్యప్ప కరుణగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలలో గురుస్వాములు చాకలికొండ వ్యాయామ ఉపాధ్యాయులు వెలుగోటి. క్రిష్ణ, మనం ఫౌండేషన్ చైర్మన్, వి మొబైల్స్ అధినేత చిట్టమూరి. హరీష్, కార్య నిర్వాహకులు సూరం. అయ్యప్పరెడ్డి, సూరం. సురేంద్ర రెడ్డి, సూరం. నాగిరెడ్డి, గని. రాకేష్ నాయుడు, వింజమూరు పంచాయితీ మాజీ వార్డు సభ్యులు పోలుబోయిన. మాల్యాద్రి యాదవ్ తదితరులు పాల్గొన్నారు...
హరిహర పుత్ర అయ్యప్ప సన్నిధిలో భారీ అన్నదానం