పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్

 


విజయవాడ తేదీ: 28.11.2019


పాఠశాలలో జరిగిన శారీరక దండన పై బాలల హక్కుల కమిషన్ సీరియస్


 
అనంతపురం జిల్లా కదిరి మున్సిపల్ పరిధి లోని నూలుబండ మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇద్దరు చిన్నారులు తరగతి గదిలో అల్లరి చేస్తున్నారని , పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి శ్రీదేవి బెంచ్ కు తాడుతో కట్టి బంధించడంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి ఆగ్రహం వెలిబుచ్చారు.   
చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పి వారి భవితవ్యాన్ని తీర్చి దిద్దాల్సిన చోట ఉపాధ్యాయుల అవగాహనా రాహిత్యం, కోపావేశాల వలన పిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.  జరిగిన సంఘటనపై జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమీషనర్ తో మాట్లాడారు.   ఎంక్వయిరీ జరిపించి బాలల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడడమే కాకుండా చిన్నారుల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై  విచారణ జరిపించి తక్షణమే బాధ్యులపై క్రిమినల్ మరియు శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని తెలియచేసారు.   
బాలల న్యాయ చట్టం సెక్షన్ 82 , ఉచిత నిర్బంధ విద్య హక్కు చట్టం 2009  సెక్షన్ 17  ప్రకారం పాఠశాలల్లో శారీరిక, మానసిక దండన చట్టరీత్య నేరం అదేవిధంగా పైన జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి బాలలకు  రావలసిన నష్టపరిహారాన్ని అందేలా చూడాలని ఆదేశించారు.   
మన ఆంధ్ర రాష్ట్రాన్ని బాలల స్నేహపూర్వక రాష్ట్రంగా అందరూ పిల్లలు విద్యనభ్యసించేలా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు వివిధ వినూత్న పథకాలు ప్రవేశ పెట్టి  అమ్మఒడి , ఆనందవేదిక, నో బాగ్ డే, స్కాలర్షిప్స్ , కెజిబివిలలో 12  తరగతి వరకు విద్య ద్వారా 6 నుండి 18  సంవత్సరాలవరకు ఉన్న బాల బాలికలందరు  ఆనంద ఉత్సాహాల మధ్య నైతిక విలువలతో కూడిన విద్యను అభ్యసించడానికి ప్రోత్సహిస్తున్నారు  అని  తెలిపారు.   
కానీ  ఉపాధ్యాయులలో అవగాహనా లోపం కారణంగా అక్కడక్కడాజరుగుతున్నా ఇలాంటి సంఘటనలు చిన్నారులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని అన్నారు. కమిషన్ ఈ  కేసు ను  సుమోటోగా తీసుకుంటుందని అన్నారు.
 
జి. హైమావతి, చైర్ పర్సన్, 8500242805