రాష్ట్రంలో అసమర్థ పాలన: పోతిన మహేష్
అమరావతి : రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుందని జనసేన నేత పోతిన మహేష్ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో పాలన తాడేపల్లి నుండి జరుగుతుందా? లేక చర్లపల్లి జైలు నుంచి జరుగుతుందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. జగన్‌కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఇంగ్లిష్ మీడియంకు జనసేన వ్యతిరేకం కాదని, తెలుగు మీడియంను ఎత్తివేయడం మాతృ భాషకు ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు. కొడాలి నాని మాటలు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాష్ట్ర పరిస్థితులపై కేంద్రం జోక్యం చేసుకోవాలని పోతిన మహేష్ కోరారు.
రాష్ట్రంలో అసమర్థ పాలన: పోతిన మహేష్