సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం

కృష్ణా జిల్లా, మచిలీపట్నం ...
* కార్తీకమాసం సముద్ర స్నానాలు, పాండురంగ స్వామి ఉత్సవాలపై సమీక్షా సమావేశం...
* మచిలీపట్నం, ఆర్ అండ్ బి అతిధి గృహంలో రాష్ట్ర మంత్రి పేర్ని నానితో సమీక్షా సమావేశంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు ...


మంత్రి పేర్ని నాని కామెంట్స్ ...
* మచిలీపట్నంకు మరో పేరు పండరీపురం ...
* పాండురంగస్వామి గుడి ప్రతిష్ఠతోనే మచిలీపట్నంను పండరీపురం అని పిలుస్తున్నాం ...
* కార్తీక పౌర్ణమి సందర్బంగా పాండురంగ ఉత్సవాలు జరుపుకోవటం విధితమే ...
* 9వ తేదీ స్వామి వారి రధోత్సవం నిర్వహిస్తాం...
* 11, 12వ తేదీ కార్తీక పౌర్ణమి సముద్రస్నానాలు ఆచరించటానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ...
* జిల్లా కలెక్టర్ నేతృత్వంలో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు ...
* మంగినపూడి బీచ్ కు వెళ్ళే-వచ్చే ప్రధాన రహదారిని 'వన్ వే ' కేవలం వెళ్లటానికి మాత్రమే ఉపయోగించేట్లు  ఏర్పాట్లు ...
* బీచ్ వద్ద నుండి తిరుగు ప్రయాణం నిమిత్తం నందమూరు, పెడన మీదుగా ట్రాఫిక్ మళ్లించడం జరుగుతుంది...
* బంటుమిల్లి వైవు నుండి వచ్చే ప్రయాణికులకు ట్రాఫిక్ మళ్లించి  పెద్దపట్నం బీచ్ వద్ద స్నానాలకు ఏర్పాట్లు చేయటం జరిగింది 
* సౌకర్యవంతంగా స్నానం ముగించుకుని క్షేమంగా ఇంటికి రావటానికి అవకాశం కల్పిస్తాం ...
* ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కొన్ని రహదారుల ఏర్పాట్లు చేశాం పోలీసులకు, ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని ప్రజలను కోరుతున్నాం