పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి :ఎంపీడీఓ నాగమణి
గూడూరు :
పరిసరాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని గుడూరు ఎంపీడీఓ నాగమణి పేర్కొన్నారుక్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామమైన గుడూరు మండల పరిధిలోని పుట్టంరాజు కండ్రిగ,నెర్నూర్ గ్రామంలో పారిశుధ్య వారోత్సవాలను నిర్వహించారు.ఈ వారోత్సవాలలో భాగంగా వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేశారు.ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన టైఫాయిడ్,మలేరియా,డయేరియాలు లాంటి వ్యాధుల ను నివారించేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు.ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి రవికుమార్,పంచాయతీ కార్యదర్శి తిరుపతమ్మ,తదితరులు పాల్గొన్నారు.