ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
కృష్ణా : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శుక్రవారం నాడు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. జిల్లాలోని జెడ్పీ కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి మంత్రి నాని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జ్ జడ్జి భీమారావు, జాయింట్ కలెక్టర్ డా.కె మాధవీలత, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ బాబు పాల్గొన్నారు. కాకినాడలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ నివాళులు అర్పించారు. పార్లమెంటు సభ్యులు వంగా గీత, చింత అనురాధ, జిల్లా కలెక్టర్ మురళీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ అవతరణ దినోత్సవంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఒకరకంగా ఇది తొలి అవతరణ దినోత్సవం కింద లెక్క. అంతకు ముందే ఐదేళ్లపాటు నవ నిర్మాణ దీక్షను నిర్వహించిన విషయం విదితమే.
ఏపీలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు