పున్నమి ఘాట్ ప్రాంతం లో పర్యటించిన మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు..
విజయవాడ.
తేదీ.4-11-19.
గత టిడిపి ప్రభుత్వం ప్రచారం పై చూపిన శ్రద్ధ అభివృద్ది పై చూపలేదని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సోమవారం పలు శాఖల అధికారుల తో కలిసి దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నగరం లో పలు ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత పశ్చిమ నియోజక వర్గం లో 27 వ డివిజన్ పున్నమి ఘాట్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు,ఈ ప్రాంతం లో విద్యుత్, తాగు నీరు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నగర అభివృద్ది కి దశల వారీగా అభివృద్ది పనులు చేపడుతున్నామని త్వరలోనే సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా అని మంత్రి బరోసా ఇచ్చారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఎమ్మార్వో సుగుణ, వై యస్ అర్ సిపి డివిజన్ అద్యక్షులు ఆంజనేయ రెడ్డి, వై యస్ అర్ సిపి నాయకులు జీఎం సి బాషా తదితరులు పాల్గొన్నారు.