విజయనగరం,: పట్టణంలో కే. ఎల్. పురం ప్రాంతంలో ఉన్న చాకలి చెరువు శుద్ధి చేసే కార్యక్రమం జిల్లా కలెక్టర్ డా ఎం. హరి జవహర్ లాల్ నేతృత్వంలో విద్యార్థులు, స్థానికులు కలసి చేపట్టారు. కలెక్టర్ స్వయంగా గుర్రపు డెక్క ను చెరువు లో నుండి బయటకు వేయడంలో సహాయ పడుతూ అందరిలో స్ఫూర్తి నింపారు. నగరంలోని 88 చెరువుల్లో ఇప్పటికే 15 చెరువులను ప్లాస్టిక్ ఇతర వ్యర్థాలను తొలగించి పరిరక్షిం చారు. ఈ స్ఫూర్తితో జిల్లాలో ఇతర ప్రాంతాల్లోనూ చెరువుల శుద్ధిని చేపట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు
చాకలి చెరువు శుద్ధి