నూతన కార్యాలయంలో లోకేశ్ దంపతుల పూజలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో నిర్మాణం పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శృంగేరీ శారదాపీఠం పండితులు, రుత్విక్కుల ఆధ్వర్యంలో గురువారం కార్యాలయం ఆవరణలో ముందుగా గణపతి పూజ చేశారు. అనంతరం సుదర్శన హోమం, గణపతి హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితుల సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశారు.