విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోథర్డ్ జెండర్స్ కు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి 

 విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో లోథర్డ్ జెండర్స్ కు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి 


    నెల్లూరు /వెంకటాచలం, ఏప్రిల్  13. (అంతిమ తీర్పు):            విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం  జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జిల్లా లోని జనార్ధన రెడ్డి నగర్ లో నివసిస్తున్న సుమారు 60 మంది థర్డ్ జెండర్స్ (హిజ్రాలకు) బియ్యం నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేశారు.  ఈ కార్యక్రమానికి జిల్లా NSS  సమన్వకర్త డా. ఉదయ్  శంకర్ అల్లం పాల్గొని అందరికి వస్తువులు పంపిణి చేశారు.  ఈ సందర్భముగా అయన మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు, రిజిస్ట్రార్ డా. యల్ విజయకృష్ణా రెడ్డి గారి   సూచనల మేరకు జిల్లాలో ప్రభుత్వము నుంచి ఎటువంటి సాయం అందని వారికి చేయూతనివ్వటానికి NSS ముందుకొచ్చిందని అన్నారు. థర్డ్ జెండర్స్ రోజూ బిక్షాటన చేసుకొని జీవనోపాధి సాగిస్తున్నారని ప్రస్తుతం నెలకొని వున్న  లాక్ డౌన్ వలన  వారు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారి ఇబ్బందులను కొన్ని వార్తా చానెల్స్ ద్వారా తెలుసుకొని వారికి  విశ్వవిద్యాలయం తరపున  తమవంతు సాయం చేశామన్నారు. థర్డ్ జెండర్స్ అధ్యక్షరాలైన  శ్రీమతి అలేక్య మాట్లాడుతూ తమ బాధలను అర్ధం చేసుకొని మాకు సహాయం చేయటానికి ముందుకు వచ్చిన విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో NSS  ప్రోగ్రాం ఆఫీసర్ విజయ్ కుమార్, కృష్ణ చైతన్య డిగ్రీ కాళాశాల NSS వాలంటీర్లు మరియు NCC కేడీదాట్లు పార్ధసారధి, రాజేష్, శివరాజ్, చైతన్య, ప్రేమ్ చంద్ , కావ్య మరియు జోస్త్న పాల్గొన్నారు


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు