కరోనా పరీక్షల కిట్లను పెద్ద ఎత్తున ఉత్పత్తిచేస్తున్నాం: మంత్రి గౌతమ్ రెడ్డి
అమరావతి,.ఏప్ర్రిల్, 16 (అంతిమ తీీర్పు).:
ఇప్పటికే 50 వేల కోవిడ్ కిట్లను ఉత్పత్తి చేసాం అని మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన లో అన్ని జిల్లాలకు, మండలాలకు కోవిడ్ కిట్లను పంపిస్తున్నాం
అని తెలిపారు. కరోనా కిట్ల ద్వారా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తాం .మరో 50 వేల టెస్టింగ్ కిట్లను ఉత్పత్తి చేయాలని సీఎం ఆదేశించారు .మొత్తం కరోనా కిట్లతో 20 లక్షల పరీక్షలు నెల రోజుల్లో చేస్తాం
రెండు రోజుల్లో ఇండియన్ టెక్నాలజీ తో వెంటిలేటర్లు తయారు చేస్తాం .సీఎం జగన్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైంది -.దేశంలో తొలి సారిగా ఏపీలో కరోనా కిట్స్ ఉత్పత్తి జరుగుతోంది..35 రోజుల్లోనే టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి చేశాం .సీఎం జగన్ ను స్వయంగా కేంద్ర మంత్రులు అభినందిస్తున్నారు . పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు చర్యలు చేపట్టాం .కార్మికులకు, ఉద్యోగులకు రక్షణ కిట్లను అందిస్తాం . ఇందు కోసం ప్రభుత్వమే చర్యలు తీసుకుంటోంది . దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎమ్ఎస్ఎమ్ఈలను ఆదుకుంటాం . లాక్ డౌన్ నేపథ్యంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు రాయితీ ఇవ్వాలని సీఎం భావిస్తున్నారు . సీఎం జగన్ ఒక్కరే దేశంలో నిర్ణయం తీసుకున్నారు .పారిశ్రామిక రంగాన్ని ఆదుకోవడానికి అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. అని మంత్రి గౌతమ్ రెడ్డి. తెలిపారు