గూడూరు ఏప్రిల్ 25,(అంతిమ తీర్పు) : మునిసిపల్ కమిషనర్ గౌ"శ్రీ ఓబులేష్ సూచనలు మేరకు 22 వ వార్డ్,19 వ వార్డులు నందు శ్రీ కృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మరియు అంతర్జాతీయ మానవ హక్కులు, నేర వ్యతిరేక సేవా సంస్థ రాష్ట్ర కార్యదర్శి మయూరి శ్యామ్ యాదవ్ ధాతృతమ్తో 70 కుటుంబాలకు కూరగాయలను మునిసిపల్ కమిషనర్ శ్రీ ఓబులేష్ ముఖ్య అథిగా విచ్చేసి పంపిణీ చేయడం జరిగింది. మునిసిపల్ కమిషనర్ మాట్లాడుతూ సామాజిక దూరం పాటించాలని ,అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని మరి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ ఈ కరోన వైరస్ కోవిడ్ 19 కి ఇంతవరకు మెడిషన్ లేని కారణంగా మనము సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం,బూత్రూం కి పోయినప్పుడు సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవడం, ఏదైనా జ్వరం గాని దగ్గు గాని జలుబు గాని ఎక్కువ గా ఉండినచో మీ సమీపంలో ఉన్న హాస్పిటల్ కు పోయి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ,మరియు మాస్కు లు ధరించడం మొదలగున్నవి జాగ్రత్తలు పాటించవలసిన. మనమందరం ఈ కరోన కివిడ్ 19 వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మునిసిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది,రెవెన్యూ సిబ్బంది,మరియు వైద్య సిబ్బంది మరియు ఈ కరోన కోవిడ్ 19 వైరస్ గురించి మనకు సమాచారాన్ని అందించే ప్రింట్ అండ్ ఎల్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరూ ఎంతో శ్రమించుచున్నారు అందువలన అందరికి అభినందనలు తెలుపు చున్నాను అని మయూరి శ్యామ్ యాదవ్ చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆనంద్,రమేష్,సురేష్, మరియు వాలేంటరీస్ పాల్గొనడం జరిగింది.
మయూరి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ