1,184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

1,184 వైద్యుల పోస్టులు భర్తీకి నోటిఫికేషన్
• రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు(మీడియా మేనేజ్ మెంట్) టి.విజయ్ కుమార్ రెడ్డి
• కాంట్రాక్టు పద్ధతిలో నియామకం
• ఈ నెల 19వ తేదీ దరఖాస్తులకు ఆఖరు రోజు
• దరఖాస్తులన్నీ ఆన్ లైన్ లోనే అందజేయాలి...
విజయవాడ, ఏప్రిల్ 17 : రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో 1,184 స్పెషలిస్టు డాక్టర్లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆసీఫర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్ ఫిషియో కార్యదర్శి, రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు(మీడియా మేనేజ్ మెంట్) తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 1,184 పోస్టుల్లో 592 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, 192 అనస్తియాలజీ పోస్టులు, 400  జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఈ పోస్టులన్నీ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనుందన్నారు. ఎంపికైన వారు కాంట్రాక్టు ప్రాతిపదికన ఏడాది పాటు పనిచేసే విధంగా ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్పెషలిస్టు వైద్యులకు రూ.1,10,000లు, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లకు రూ.53,945లు వేతనంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తి, అర్హతల గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీలోగా dme.ap.nic.in  ఆన్ లైన్లో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు dme.ap.nic.in  వెబ్ సైట్ ను పరిశీలించాలని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమీషనర్, ఎక్స్ ఫిషియో కార్యదర్శి, రాష్ట్ర స్థాయి కరోనా నివారణ కమిటీ సభ్యులు(మీడియా మేనేజ్ మెంట్) టి.విజయ్ కుమార్ రెడ్డి ఆ ప్రకటనలో తెలిపారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు