30.4.2020
అమరావతి
- రేపు (మే 1వ తేదీ) వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్దం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
- రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు
- రూ.1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసి ప్రభుత్వం.
- ఇప్పటికే గ్రామ, వార్డు కార్యదర్శుల ఖాతాల్లోకి సొమ్ము జమ
- వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి పెన్షనర్ల చేతికే పెన్షన్ సొమ్ము.
- పెన్షన్ల పంపిణీలో 2,37,615 మంది వాలంటీర్లు.
- కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్
- బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫోటోల జియో ట్యాగింగ్.
- లాక్ డౌన్ వల్ల వేరే ప్రాంతాల్లో వున్న వారికి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్లు.
అమరావతి:
రాష్ట్రవ్యాప్తంగా వైస్ఆర్ పెన్షన్ కానుకను మే నెల ఒకటోతేదీన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకవైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే, మరోవైపు లక్షలాధి మంది పెన్షనర్ల చేతికే ఒకటో తేదీన పెన్షన్ సొమ్మును అందించేందుకు ప్రభుత్వం సర్వం సిద్దం చేసిందని తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 2,37,615 మంది వాలంటీర్లతో పెన్షన్ సొమ్మును పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కోవిడ్ – 19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయో మెట్రిక్ కు బదులుగా ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా జియోట్యాగింగ్ తో కూడిన ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేస్తారని తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే మొత్తం వాలంటీర్లకు ప్రభుత్వం అందచేసిన ఫోన్ లలో అధికారులు ఈ ప్రత్యేక యాప్ ను డౌన్ లోడ్ చేయించారని అన్నారు. మే నెలలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రభుత్వం 1421.20 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, ఇప్పటికే ఈ మొత్తంను పేదరిక నిర్మూలనాసంస్థ (సెర్ఫ్) ద్వారా రాష్ట్రంలోని వార్డు, గ్రామ సచివాలయ కార్యదర్శుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని అన్నారు. సచివాలయ కార్యదర్శుల నుంచి సొమ్మును వాలంటీర్లకు అందచేయడం ద్వారా, శుక్రవారం (మే 1వ తేదీ) ఉదయం నుంచే నేరుగా పెన్షనర్ల చేతికి పింఛన్ సొమ్ము అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అధికారుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల వరకు భాగస్వాములు అవుతున్నారని, లాక్ డౌన్ నిబంధనల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో వుండిపోయినట్లయితే, వారిని కూడా గుర్తించి, పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులతో పాటు గుర్తింపు పొందిన వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా నెల ఒకటో తేదీనే పెన్షన్ సొమ్ము అందించాలన్న ముఖ్యమంత్రి శ్రీ వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్ఐవి, డయాలసిస్ పెషంట్లకు డిబిటి విధానంలో పెన్షన్ సొమ్మును జమ చేస్తున్నామని పేర్కొన్నారు.
*జిల్లాల వారీగా పెన్షనర్లు, విడుదల చేసిన రూ.మొత్తం*
జిల్లా పెన్షనర్లు రూ.కోట్లలో...
అనంతపురం 512900 126.16
తూ.గో.జిల్లా 496416 120
గుంటూరు 556766 136.08
కృష్ణాజిల్లా 483756 118.68
కర్నూలు 421315 103.07
నెల్లూరు 3450345 85.44
ప్రకాశం 412768 101.48
శ్రీకాకుళం 367755 8834
విశాఖపట్నం 454739 111.33
విజయనగరం 325429 78.66
ప.గో.జిల్లా 475140 116.37
వైఎస్ఆర్ కడప 329527 79.68
*వివిధ రకాల పెన్షన్ల వివరాలు:*
కేటగిరి పెన్షన్ల సంఖ్య రూ.కోట్లలో..
వృద్ధాప్య పెన్షన్లు 2592072 598.12
అభయహస్తం 71287 3.74
చేనేత 107286 25.10
దివ్యాంగులు 621758 194.74
వితంతువులు 2064147 491.64
గీతకార్మికులు 31708 7.31
ట్రాన్స్ జెండర్లు 2079 0.70
మత్స్యకారులు 51816 12.29
వంటరి మహిళ 147482 34.91
చర్మకారులు 20663 4.87
డప్పు కళాకారులు 31429 9.67
ఎఆర్టీ పెన్షన్లు 31689 7.13
సికెడియు పెన్షన్లు 10897 10.90
డిఎంహెచ్ఓ పెన్షన్స్ 38101 20.08