నెల్లూరు, ఏప్రిల్ 30 (అంతిమ తీర్పు) : బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో 11వ రోజు నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత. భారతీయ జనతాపార్టీ మజ్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో , కరోనా వైరస్ మహమ్మారి కరువు నేపథ్యంలో తన వంతు చేయూత గా నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుపేద ప్రజలకు 11వ రోజు బుధవారం ఆహార పొట్లాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటికి కనిపించని కరోనా వైరస్ సోకిన వ్యక్తి మరణించక తప్పదు అని తెలిసి , కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో లాక్ డోన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఆకలి దప్పుల పై మనసున్న దాతలు తమ అభయహస్తం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో తన వంతు చేయూత గా , తన సొంత నిధులతో ను మరియు దాతల సహాయ సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరం అన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాలలో తిరిగి యాచకులు, నిరుపేదలను గుర్తించి వారందరికీ ఒక్కపూట ఆహారం అందించారు. ఈ కార్యక్రమంలో బండారు సురేష్ నాయుడు మిత్రబృందం, తదితరులు పాల్గొన్నారు.
బండారు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో 11వ రోజు నిరుపేదలకు ఆహార పొట్లాలు అందజేత.