11 మందిని   నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్జి : కలెక్టర్ జి.వీరపాండియన్

*బిగ్ బ్రేకింగ్ - Kurnool -27-4-2020* - *మరో బిగ్ రిలీఫ్*


*కర్నూలు జిల్లాలో కరోనాను జయించిన మరో 11 మందిని   నంద్యాల శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి నుండి ఈ సాయంత్రం డాక్టర్లు DISCHARGE చేశారు*: *కలెక్టర్ జి.వీరపాండియన్*


*ఇప్పటివరకు కర్నూలు జిల్లాలో 42 మంది కరోనా విజేతలు డిశ్చార్చ్: కలెక్టర్ వీరపాండియన్*


*కర్నూలు జిల్లాలో కరోనా కేసులు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో కరోనా కోరల నుండి ఆరోగ్యంగా బయటపడి ఒకే రోజు 11 మంది డిశ్చార్చ్ కావడం మరొక బిగ్ రిలీఫ్...జిల్లా ప్రజలందరికీ, జిల్లా యంత్రాంగానికి కరోనాను జయించవచ్చనే నమ్మకం, మనో ధైర్యం పెరిగింది:  కలెక్టర్ వీరపాండియన్*


*ఈ రోజు రాత్రి శాంతిరామ్ కోవిడ్ ఆస్పత్రి నుండి డిశ్చార్చ్ అయిన 11 మంది ఢిల్లీ మర్కజ్ కు వెళ్లి కరోన బారిన పడి మెరుగైన ప్రభుత్వ వైద్యం, సదుపాయాలతో కరోనా మహమ్మారిని జయించి ఆరోగ్యంగా ఆనందంగా ..జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాల్లో ఇంటికి వెళ్లారని కోవిడ్ ఆస్పత్రి ప్రత్యేక అధికారి నారాయణమ్మ , డాక్టర్లు తెలిపారు*


*డిశ్చార్చ్ అయిన 11 మందిలో చాగలమర్రి భార్య భర్తలు ( భార్య వయసు 32 సంవత్సరాలు). (భర్త వయస్సు 38 సంవత్సరాలు), నంద్యాల  ఐలూరు లోని ఇద్దరు పురుషులు (32 సంవత్సరాలు) (61సంవత్సరాలు ) , చాబోలు వాసులు 25 సంవత్సరాల  యువకుడు, 46 సంవత్సరాల పురుషుడు , 50 సంవత్సరాల మహిళ,  నంద్యాల సలీం నగర్ వాసి  32 సంవత్సరాల పురుషుడు,  ఫారుక్ నగర్ 32 సంవత్సరాల పురుషుడు , కోట వీధిలోని 41 సంవత్సరాల పురుషుడు,  నడిగడ్డ లో 26 సంవత్సరాల పురుషుడు డిశ్చార్చ్ అయ్యారని డాక్టర్లు తెలిపారు*


*ఈనెల 5 న  మరియు 8 తేదీలలో శాంతిరాం కోవిడ్ హాస్పిటల్ లోని ఐసోలేషన్  వార్డులలో అడ్మిట్ అయిన 11 మంది ప్రభుత్వ సహాయంతో.. వైద్యులు,  పారామెడికల్ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కృషితో కరోన మహమ్మారిని జయించి, రెండు పర్యాయాలు కరోన పరీక్షలు చేయించుకొని నెగటివ్ ఫలితం రావడం తో కోవిడ్ డిశ్చార్చ్ ప్రోటోకాల్ ప్రకారం ఈరోజు రాత్రి డిశ్చార్జ్ చేసినట్లు శాంతి రామ్ కోవిడ్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు*


*నంద్యాల సమీపంలో ఉన్న శాంతిరామ్ జిల్లా కోవిడ్ ఆస్పత్రి వద్ద జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాల మేరకు కరోనా విజేతలను, డాక్టర్లు, సిబ్బందిని అభినందించి... డిశ్చార్చ్ ఆయిన 24 మందికి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల నగదును అందించి...ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు పంపిన  కోవిడ్ ఆస్పత్రి  స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ*


*కరోనా బారిన పడినా తమ నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనీయకుండా మొత్తం  ప్రభుత్వం తరఫున భరించి.. తమను బాగా చూసుకుని..ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలను ఇచ్చి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి,  ప్రభుత్వానికి,   డాక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వీరపాండియన్,  అందరికీ ధన్యవాదాలు తెలిపిన 11 మంది కరోనా విజేతలు*


     ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో కరోనా విజేతలుగా నిలిచి ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వెళ్లి...అందరిలో ధైర్యాన్ని, స్ఫూర్తి ని నింపిన 42 మంది కరోనా విజేతలు*
*ఈ రోజు రాత్రి కర్నూలు నారాయణ క్వారంటైన్ కేంద్రం నుండి 55 మందిని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం డిశ్చార్చ్. ఇప్పటి వరకు జిల్లాలో 24 క్వారంటైన్ కేంద్రాల నుండి మొత్తం 758 మందిని కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం డిశ్చార్చ్ చేసాము: కలెక్టర్ వీరపాండియన్.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు