విజయవాడ,ఏప్రిల్ 23 (అంతిమ తీర్పు) :ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు కొనే ముందు ICMR ను సంప్రదించారా అని ప్రశ్నించిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ .కిట్లు కొనుగోలు విషయంలో 8 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కుంటున్న జగన్మోహనరెడ్డి గారి ప్రభుత్వము ఇప్పుడు ఏమి సమధానం చెబుతుంది .ICMR తాజా నిర్ణయంతో జగన్ సర్కారు గొంతులో పడిన పచ్చి వెలక్కాయ అని అన్నారు.12 కోట్లు పెట్టి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్లు కొనుగోలు చేసిన జగన్ ప్రభుత్వం.ఇప్పుడు ఈ నిర్ణయంతో.. బూడిదలో పోసిన 12 కోట్లు.కరోనా వైరస్ నిర్ధారణ కోసం కేవలం RT-PCR పరీక్షలు మాత్రమే చేయాలని, దాని స్థానంలో ర్యాపిడ్ యంటి బాడీ టెస్టులు చేయవద్దని భారత వైద్య పరిశోధన మండలి-ICMR రాష్ట్రాలకు మరోసారి సూచించింది.
కరోనా రోగ నిర్ధారణ కోసం ముక్కులు, గొంతు నుంచి తీసుకునే స్వాబ్ ఆధారంగా RT-PCR టెస్టులు మాత్రమే చేయాలని కోరారు. వైరస్‌కు గురైన వ్యక్తి శరీరంలో రోగ నిరోధక శక్తులు- యాంటీబాడీలు ఎంతవరకు తయారయ్యాయని తెలుసుకోవడానికి మాత్రమే యాంటీబాడీ టెస్టులు చేస్తారని.. ప్రపంచ వ్యాప్తంగా ఇదే విధానం కొనసాగుతోందన్న ఇకంర్.ఎట్టిపరిస్థితుల్లోనూ.. RT-PCR కిట్ల స్థానంలో యాంటిబాడీ టెస్టింగ్ కిట్లు ఉపయోగించకూడదని తేల్చిచెప్పిన ICMR.రాష్ట్రాలన్నీ.. ర్యాపిడ్ టెస్టుల వినియోగ విషయంలో ICMR జారీ చేసిన ప్రోటోకాల్‌ను అనుసరించాలని, కరోనా వైరస్ నియంత్రణ కోసం RT-PCR పరీక్షలను మాత్రమే కొనసాగించాలని స్పష్టమైన మార్గదర్శకాలు వైద్య పరిశోధన మండలి జారీ చేసినట్లు తెలిపారు.