166 మంది జర్నలిస్ట్ లకు తొలి రోజు పరీక్షలు పూర్తి

*జర్నలిస్టులకు ఐఎంఏ హాలులో కరోనా పరీక్షలు*
*166 మందికి తొలి రోజు పరీక్షలు పూర్తి*
*మే 03 వరకూ కొనసాగింపు*


విజయవాడలోని జర్నలిస్టులకు ఏపీయూడబ్ల్యూజే నేతృత్వంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ శాఖ సహకారంతో జర్నలిస్టులకు  కరోనా స్క్రీనింగ్ టెస్టులు మంగళవారం ఐఎంఏ హాలులో నిర్వహించారు. ఇది ఒక కరోనా స్ర్కీనింగ్ టెస్ట్ గా ఉపయోగపడు తుందని, దీని యాంటీ బాడీ టెస్ట్ గా పిలుస్తామని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూధన శర్మ అన్నారు. ఈ రక్త పరీక్ష ఫలితాలు రావడానికి  24 గంటలు పడుతుందన్నారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే వారి ఫోన్ నెంబరుకు మెసేజ్ ద్వారా తెలియజేస్తామని అన్నారు . నెగిటివ్ వచ్చిన వారికి సమాచారం రాదని చెప్పారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అర్బన్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డాక్టర్ శర్మ మాట్లాడుతూ ఈ టెస్ట్ లో నెగిటివ్ వస్తే మరే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని ఎంతో ప్రశాంతంగా ఉండొచ్చని ఆయన తెలిపారు.  ఒక వేళ పాజిటివ్ వస్తే తదుపరి టెస్టులు, వైద్యం కోసం కోవిడ్ అస్పత్రులకు, డిఎంహెచ్వోలకు వారి పేర్లను అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ టెస్ట్ ద్వారా మంచి ఫలితాలు వస్తున్న కారణంగా ప్రతిరోజు ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.  మే 03 వరకూ ఈ పరీక్షలను కొనసాగిస్తామని ఆశక్తి గల వారందరూ వచ్చి  టెస్టులు చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. మంగళవారం రోజు 180 మంది రక్త పరీక్షలకు తమ పేర్లు నమోదు చేసుకోగా 166 మంది  పరీక్షలు చేయించు కున్నారు. మిగిలిన వారు బుధవారం  ఉదయం వచ్చి చేయించుకోవాలని కోరారు.  పీపీఈ కిట్లు ధరించిన టెక్నీషియన్ల ద్వారా రక్త పరీక్షలు చేస్తున్నామని ఐఎంఏ ఉపాధ్యక్షులు డాక్టర్ రషిక్ సంఘవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే అర్బన్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, ఆంధ్ర ప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సాంబశివరావు, ట్రెజరర్ టి .వి. రమణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు