రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.

లాక్ డౌన్ కాలంలో ఉపాధికి హామీ
- పాత బకాయిలను చెల్లించేందుకు రూ.5406 కోట్లు విడుదల
- కొత్తగా రోజు కూలీ రూ.20 పెంపు
- రోజుకు ఉపాధి హామీ కూలీ రూ.182 నుంచి రూ.202 కు పెరుగుదల.
- ఏప్రిల్ 20 నుంచి పనులకు అనుమతి
- కేంద్ర ప్రభుత్వ చర్యలతో తెలంగాణలో ఊపందుకున్న పనులు
- 56 లక్షల పేదలకు ఉపశమనం.
..........
కరోనా వైరుస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించడం, మళ్లీ పొడిగించిన నేపథ్యంలో ఉపాధి లేక అల్లాడుతున్న పేద వర్గాలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పనులకు అనుమతి ఇవ్వటమే కాకుండా, రోజు కూలీ పెంచి, పెండింగ్ వేతనాలు విడుదల చేసింది. దీంతో గ్రామీణ పేద వర్గాలకు ఉపశమనం లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామణ ఉపాధి హమీ పథకం కింద ఇప్పటి వరకు ఉన్న వేతన బకాయిలను చెల్లించేందుకు రూ.5406 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తం ఇప్పటికీ ఉపాధి హామీ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. 


పెరిగిన వేతనం
ఉపాధి హామీ రోజు కూలీ ప్రస్తుతం ఉన్న రూ.182 నుంచి రూ.202కు పెంచి కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తెచ్చింది. ఒకేసారి కూలీ రూ.20 పెంచడంతో ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో గ్రామీణ పేదలకు లబ్ధి చేకూరింది. ఏడాదికి కనీసం వందరోజులు ఉపాధికి హామీ ఉన్న సంగతి తెలిసిందే. అంటే ఒక్కో కూలీకి ఏడాదికి రూ.2000 మేరకు వేతనం అదనంగా అందనుంది. దేశ వ్యాప్తంగా గా 13 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులు ఉన్నారు. 


లాక్ డౌన్ లో ఉపాధి పనులకు అనుమతి


గత మార్చ్ 24 నుంచి కరోనా వైరస్ వ్యాప్తిని అరిక్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. తెలంగాణలో ఇది మే 7వరకు అమల్లో ఉంటుంది. ఫలితంగా పనులన్నీ నిలిచిపోయి ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారింది.రోజువారీ ఖర్చులకు ఇబ్బంది ఏర్పడుతుంది. గడ్డు పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు ఏప్రిల్ 20 నుంచి  అనుమతి ఇచ్చింది. తెలంగాణలో 56 లక్షలకు పైగా ఉపాధి హామీ కార్డుదారులు ఉన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వీరందరికీ మేలు చేకూ రనుంది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనులు ప్రారంభించాలి అని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆదేశించడంతో గ్రామాలలో పనులు ప్రారంభ మయ్యాయి. భౌతిక దూరం పాటిస్తూ పనులు చేపట్టాలని ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ పనులు సాగుతున్నాయి.


పనుల్లేక ఇబ్బంది పెడుతున్న సమయంలో కేంద్ర ప్ర‌భుత్వం ఉపాధి పనులు ఇవ్వడం, పీఎం కిసాన్ కింద రూ.2000 మంజూరు చేయడంతో గండం గట్టెక్కినాము. లేదంటే ఇంట్లో అందరం పస్తులు ఉండాల్సి వచ్చేది - 
జనగామ‌ జిల్లా నర్మెట్ట మండలం లోక్య తండా గ్రామ నివాసి బానోత్ బాపు నాయక్.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు