కోవిడ్-19 పై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించిన యం.పి.డి.ఓ
వింజమూరు, ఏప్రిల్ 21 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని బి.సి.కాలనీ సమీపంలో చెక్ డ్యాం వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను మంగళవారం నాడు యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ పరిశీలించారు. మస్టర్లలో నమోదైన పేర్లును పిలుస్తూ బినామీలు ఎవరైనా ఉన్నారా అనే విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకుని హాజరు శాతమును పరిశీలించారు. అనంతరం ఆమె ఉపాధిహామీ కూలీలను సమదూరం పాటించే విధంగా సమావేశపరిచి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు గానూ పలు సూచనలు, సలహాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉందని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలకు చేతులు శుభ్రపరుచుకునేదుకు సబ్బులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శి బి.శ్రీనివాసులురెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు, సచివాలయ ఉద్యోగులు రమాదేవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.