కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష

*17-04-2020,*
*అమరావతి.*


కోవిడ్‌ –19 నివారణా చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష


అమరావతి: 


ర్యాపిడ్‌ టెస్టు కిట్లు రావడంతో పరీక్షలు పెరుగుతున్నాయన్న  వైద్యులు
రోజుకు చేసే టెస్టుల సంఖ్య 10వేల నుంచి 15వేలకు పెరుగుతుందన్న అధికారులు
కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలన్న సీఎం


*పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎం ఆరా*


పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గతంలో ముఖ్యమంత్రిగారు ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామన్న వైద్యశాఖ అధికారులు
40 సంవత్సరాల పైబడి... ఏదైనా  వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పాటిస్తున్నామని వెల్లడి
కరోనా లక్షణాలు ఉంటే.. నేరుగా కోవిడ్‌ ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నామని ముఖ్యమంత్రికి వెల్లడించిన అధికారులు
క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌ మెంట్‌కోసం కొంతమంది డాక్టర్లతో కూడా ఒక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని, ఏ సమయంలోనైనా ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులకు నిరంతరం గైడెన్స్‌ ఇస్తారని, పేషెంట్‌ పారామీటర్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని వెల్లడించిన అధికారులు
జిల్లాల్లోని గుర్తించిన కోవిడ్‌ ఆస్పత్రులు కాకుండా మిగతా ఆస్పత్రుల్లో రెగ్యులర్‌ సర్వీసులకు, ఎమర్జెన్సీ సర్వీసులకు ఇబ్బందులకు గురికాకుండా చూస్తున్నామన్న అధికారులు
ఆరోగ్యశ్రీలో నమోదైన రోగులకు నేరుగా కాల్‌ చేసి.. వారికి ఏ ఆస్పత్రిలో సేవలు లభిస్తాన్నయన్నదానిపై సమాచారాన్ని తెలియజేస్తున్నామని వెల్లడి
క్వారంటైన్లలో సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్న అధికారులు
క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నవారు అంతా.. సింగిల్‌ రూమ్స్‌లో ఉన్నారన్న అధికారులు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు