కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ –19 నివారణా చర్యలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష
అమరావతి : రాష్ట్రంలో కోవిడ్‌విస్తరణ, పరీక్షలు, పాజిటివ్‌గా నమోదైన కేసుల వివరాలను సీఎంకు అందించిన అధికారులు. మరో నాలుగైదు రోజుల్లో కోవిడ్‌ –19 పరీక్షల రోజువారీ సామర్థ్యం 2వేల నుంచి 4వేలకు పెంచుతామన్న అధికారులు. ప్రస్తుతం రోజుకు 2100కుపైగా పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు. ట్రూనాట్‌ పరికరాలను వినియోగించుకుని పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామన్న అధికారులు. కుటుంబ సర్వేద్వారా గుర్తించిన సుమారు 32వేల మందికి కూడా పరీక్షలు చేయాలన్న సీఎం. వీరికి పరీక్షలు ప్రారంభిస్తున్నామన్న అధికారులు. ఇవి అయిన తర్వాత ర్యాండమ్‌గా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశాలు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్‌ పరీక్షలు చేయాలి: సీఎం. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి ఆరా. ప్రతిరోజూ ప్రతి మనిషికి  భోజనం, బెడ్‌కోసం, దుప్పటికోసం రూ. 500లు. ప్రతిరోజూ ప్రతిమనిషికి రూ. 50లు పారిశుద్ధ్యం కోసం, 
ఇతరత్రా ఖర్చులకోసం రోజుకు రూ.50లు, ప్రయాణ ఖర్చుల కింద క్వారంటైన్‌ సెంటర్‌కు రూ.300లు, తిరుగు ప్రయాణంకోసం కూడా మరో రూ.300లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించిన అధికారులు. డబుల్‌ రూం లేదా, సింగిల్‌రూం ఇస్తున్నామని వెల్లడించిన అధికారులు. క్వారంటైన్‌ సెంటర్లలో మెడికల్‌ ప్రోటోకాల్‌ పూర్తిచేసుకుని తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు బీదలకు కనీసం రూ.2వేలు ఆర్థిక సహాయం చేయాలన్న సీఎం. వాళ్లు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా పాటించాల్సిన జాగ్రత్తలను సూచించండి. ప్రతి వారం కూడా వాళ్లు పరీక్షలు చేయించుకునేలా చూడాలన్న సీఎం. క్వారంటైన్‌ సెంటర్లలో ఏమేమి ఉండాలన్నదానిపై ఎస్‌ఓపీని దిగువ అధికారులకు పంపించాలన్న సీఎం. ఫ్రంట్‌ లైన్లో ఉన్నవారికి, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారి ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్త వహించాలన్న సీఎం. అరటి, పుచ్చ ఉత్పత్తులకు మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. రైతులను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం. వంటనూనెల ధరలపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం. సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, మోపిదేవి వెంకటరమణ, కురసాల కన్నబాబు.
సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌సహా అధికారులు హాజరు.


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image