గ్రీన్ జోన్ పరిశ్రమలలో పనిచేసేందుకు తరలించేలా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు : కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి

      విజయవాడ,తేదీ:29.04.2020 


గ్రామీణ ప్రాంతాలలో కంటెయిన్మెంట్ క్టస్టర్ వెలుపల పరిశ్రమల కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు అవసరమైన కార్మికులను ఒక మండలం గ్రీన్ జోన్ నుండి మరొక మండలం గ్రీన్ జోన్ పరిశ్రమలలో పనిచేసేందుకు తరలించేలా అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫిషియో సెక్రటరీ, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన లో తెలిపారు. 
ఏప్రిల్ 18 వ తేదీన ప్రభుత్వం (జీవో నెం. 88)  జారీ చేసిన ఉత్తర్వులను  పాక్షికంగా సవరిస్తూ  జీవో నెం. 92 జారీ చేయబడిందని, నెల్లూరు, విశాఖపట్టణం మరియు శ్రీకాకుళం పారిశ్రామిక వర్గాల అభ్యర్ధన మేరకు పై మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు.
 జీవో నెం. 88 ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ గ్రామీణ ప్రాంతాలలో అనుమతించిన పరిశ్రమలు తిరిగి ప్రారంభించుకోవచ్చని,రెడ్ జోన్ లు కల్గిన మండలాలు/మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్లలో ఎటువంటి పరిశ్రమలు నిర్వహించడానికి అనుమతించలేదని తెలిపారు. సదరు ఉత్తర్వుల ప్రకారం, పున:ప్రారంభించబడిన పరిశ్రమలలో కార్మికుల రక్షణ కోసం మరియు కోవిడ్ -19 వ్యాప్తిని నివారించడానికి అవసరమైన భౌతిక దూరం, పారిశుధ్యం మరియు ధర్మల్ స్క్రీనింగ్ వ్యవస్థలను విధిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిబంధనలను పాటిస్తున్నట్లు ఆయా పరిశ్రమలు స్వీయ ధృవీకరణ ఇవ్వాలని, నిబంధనలను పాటించని పరిశ్రమలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుటుందని కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు