పంజాబ్​లో మరో 2 వారాలపాటు లాక్​డౌన్​ కొనసాగింపు

పంజాబ్​లో మరో 2 వారాలపాటు లాక్​డౌన్​ కొనసాగింపు


చండీగఢ్​: లాక్‌డౌన్​ను మరో రెండు వారాలు పొడిగిస్తూ పంజాబ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్​ ఎత్తివేయడానికి సలహాల కోసం నియమించిన ఎక్స్‌పర్ట్ ​కమిటీ రిపోర్టు, సమాజంలోని వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ ​సీఎం అమరీందర్ ​సింగ్​ బుధవారం చెప్పారు. మే 17వ తేదీ వరకు లాక్‌డౌన్ ​కొనసాగుతుందన్నారు. అయితే గురువారం నుంచి కొన్ని సడలింపులు ఇస్తామని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ప్రజలంతా ఇళ్ల నుంచి బయటకు రావచ్చన్నారు. షాపులు ఓపెన్ ​చేసుకోవచ్చన్నారు. 50 శాతం స్టాఫ్​కి మాత్రమే పనిచేయడానికి అనుమతించనున్నారు. బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు పెట్టుకోవాలని సూచించారు. కంటైన్‌మెంట్, రెడ్​జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని ముఖ్యమంత్రి చెప్పారు.