అమరావతి, ఏప్రిల్ 27.:
లాక్ డౌన్ నేపథ్యంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ ఆదేశాలతో పేదలకు మూడో విడత రేషన్ పంపిణీకి ఏర్పాట్లు.
రెవిన్యూ అధికారులకు, డీలర్లకు మార్గదర్శకాలు జారీ చేసిన పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి కోన శశిధర్
బియ్యంకార్డుదారులకు ఈ నెల 29 నుంచి మే 10వ తేదీ వరకు రేషన్ దుకాణాల ద్వారా ఉచిత సరుకుల పంపిణీ
కరోనా నిబంధనల మేరకు భౌతికదూరం పాటిస్తూ రేషన్ తీసుకునేలా చర్యలు
టైం స్లాట్ టోకెన్ లతో ఒక్కో షాపులో రోజుకు 30 మందికే సరుకుల పంపిణీ
మొదటి, రెండు విడతల్లో వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించారు
ఈసారి మాత్రం లబ్దిదారుల బయోమెట్రిక్ తప్పనిసరి.
కరోనా జాగ్రత్తల్లో భాగంగా
అన్ని రేషన్ షాపుల వద్ద శానిటైజర్, మాస్కులు.
ప్రతి లబ్దిదారుడు బయోమెట్రిక్ ఉపయోగించే ముందు శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకునేలా డీలర్లు జాగ్రత్త వహించాలి.