చరిత్రలో ఈ రోజు - ఏప్రిల్, 29

చరిత్రలో ఈ రోజు - ఏప్రిల్, 29


సంఘటనలు
1990: బొరిక్ ఎల్సిన్ రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
1992: నల్లవారికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుకి ప్రతీకారంగా లాస్ ఏంజిల్స్ నగరాన్ని నల్లవారు మంటల్లో మండించి వారి నిరసనను తెలియ చేసారు.


జననాలు
1848: రాజా రవివర్మ, భారత ప్రఖ్యాత చిత్రకారుడు. (మ.1906)
1876: బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (మ.1947)
1893: మేకా వెంకటాద్రి అప్పారావు, ఉయ్యూరు జమీందారు, కవి, సంస్కృత, పర్షియా భాషలలో పండితుడు. నాట్యము, జ్యోతిష్యము, చిత్రకళ, సంగీతము మొదలగు కళలో కూడా ఆయనకు ప్రవేశమున్నది.
1917: ఆవుల గోపాలకృష్ణమూర్తి, ఎ.జి.కె.గా ప్రసిద్ధిచెందిన హేతువాది. రాడికల్ హ్యూమనిస్టు, సమీక్ష పత్రికలు నడిపారు. ( మ. 1966)
1970: ఆండ్రి అగస్సీ, ప్రముఖ అమెరికన్ టెన్నిస్ క్రీడాకారుడు.
1979: ఆశిష్ నెహ్రా, భారత క్రికెట్ క్రీడాకారుడు.


మరణాలు 
2003: వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది.
2006: జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ప్రముఖ ఆర్థికవేత్త. (జ.1908)
2009: గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929)
2017: ఆర్. విద్యాసాగ‌ర్‌రావు, నీటిపారుదల రంగ నిపుణుడు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. (జ.1939)


పండుగలు , జాతీయ దినాలు
- అంతర్జాతీయ నృత్య దినోత్సవం.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు