రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ

23ఏప్రిల్  2020
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగారికి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అమరావతి. 


Madam


Sub.: కోవిడ్ వైరస్ ధ్రువీకరణ పరీక్షలు- టెస్ట్ లకు ప్రయోగశాలల కొరత-ఫలితాల కోసం 16వేల శాంపిల్స్ పెండింగ్-కోవిడ్ ధ్రువీకరణకు ఫలితాలే కీలకం-ట్రూ నాట్ టెస్ట్ కిట్ల వినియోగం- వ్యక్తిగత భద్రతా పరికరాలు(పిపిఈ), శానిటైజర్ల నాణ్యతా ప్రమాణాల నిర్ధారణ-ఫ్రంట్ లైన్ వారియర్లు(డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, పోలీస్, పారిశుద్య కార్మికులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల) భద్రత గురించి:
***


 కోవిడ్ 19 వైరస్ ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకూ  చాపకింద నీరులా విస్తరిస్తోంది. టెస్ట్ లు అత్యధికంగా చేయడం ద్వారానే కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించగలం. దానితోపాటు కోవిడ్ ధ్రువీకరణ పరీక్షల ఫలితాలు త్వరగా వస్తేనే వైరస్ వ్యాప్తిని నియంత్రించగలం.  ప్రస్తుతం మనరాష్ట్రంలో పరిశీలిస్తే ఇప్పటికే 16వేల నమూనాలు కోవిడ్ వైరస్ ధ్రువీకరణ కోసం పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. 
రాష్ట్రంలో ల్యాబ్ ల సంఖ్య తక్కువగా ఉండటమే కోవిడ్ వైరస్ పరీక్షలు తక్కువగా చేయడానికి, పరీక్షల ఫలితాల్లో జాప్యానికి ప్రధాన కారణాలలో ఒకటి.  కోవిడ్ ధ్రువీకరణ ప్రయోగశాలలు రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 8 మాత్రమే ఉన్నందువల్ల  పరీక్షా ఫలితాలలో తీవ్ర జాప్యానికి దారితీస్తోంది. దీనివల్ల మిగిలిన రాష్ట్రాల్లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబరేటరీల భాగస్వామ్యంతో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది.  కోవిడ్ పై మెరుగైన పోరాటానికి తోడ్పడమే కాకుండా దీర్ఘకాలంలో మన రాష్ట్రంలో ఈ రంగంలో మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్దికి ఈ చర్య దోహదకారి కాగలదు. 
కోవిడ్ ధ్రువీకరణ కోసం భారీసంఖ్యలో దాదాపు 16వేల నమూనాలు పెండింగ్ లో ఉండటం వైరస్ వ్యాప్తికి ప్రబల కారణం అవుతున్నాయి. కాబట్టి సకాలంలో పరీక్షా ఫలితాలు వెల్లడి అయ్యేలా చూడటం ఇందులో కీలకాంశం. గత ప్రభుత్వం 250 కేంద్రాలలో ట్రూనాట్ టెస్ట్ కిట్లను ట్యుబర్ క్యులాసిస్ (క్షయ)ను పూర్తిస్థాయిలో నియంత్రించే లక్ష్యంతో అందుబాటులో ఉంచింది.   కోవిడ్ నెగటివ్ నిర్దారణలో ట్రూ నాట్ కిట్లు బాగా తోడ్పడతాయని, దీని తర్వాత పాజిటివ్ కేసుల ధ్రువీకరణకు శాంపిల్స్ ను ఆర్ టి పిసిఆర్ టెస్ట్ లకు పంపాలనేది ఇప్పటికే నిరూపితం అయ్యింది. దీని ప్రకారం అనేక ప్రాంతాలలో  కోవిడ్ నెగటివ్ నిర్దారణకు రాష్ట్ర ప్రభుత్వం ట్రూ నాట్ కిట్లను వినియోగించుకోవచ్చు. ఈ విధంగా కోవిడ్ నెగటివ్ కేసులను గుర్తించి వేరుపర్చడానికి ట్రూ నాట్ కిట్లు దోహదపడతాయి.
కోవిడ్ పరీక్షలకు ట్రూ నాట్ కిట్ల వినియోగానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే కోవిడ్ ధ్రువీకరణ కోసం ఆర్ టి పిసిఆర్ పరీక్షలే సరైన పరీక్షగా ICMR  ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించింది. గత ప్రభుత్వం ట్రూ నాట్ పరీక్షా ఫలితాలను రియల్ టైమ్ గవర్నెన్స్( ఆర్టీజిఎస్) కు అనుసందానించడం వల్ల సకాలంలో ప్రభుత్వం ద్వారా సరైన చర్యలు తీసుకోడానికి ఎంతో దోహదపడింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ట్రూ నాట్ పరీక్షా కేంద్రాలను పెంచడంతోపాటు వాటిని రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్ టిజి)కు అనుసందానించి సకాలంలో సరైన చర్యలు తీసుకునేలా చేయాలి.  ఆర్ టి పిసిఆర్ ఫలితాలతో బాటుగా, అన్ని ల్యాబ్ లనుంచి వచ్చే ఫలితాలను, ల్యాబ్ స్థాయిలోనే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి యంత్రాంగం అక్కడికక్కడే సకాలంలో సరైన చర్యలు చేపట్టేలా చూడాలి.  
వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ పై పోరాటానికి ఒక వినూత్న ప్రక్రియ, విధానం, ప్రొటోకాల్ తో సంసిద్దం కావాల్సిన అవసరం ఉంది. ఈ వినూత్న ప్రొటోకాల్ విధానం రాష్ట్రంలో కోవిడ్ వైరస్ నియంత్రణకు దోహదపడటమే కాకుండా రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తోడ్పడుతుంది. 
   నాణ్యమైన అత్యుత్తమ ప్రమాణాలు గల వ్యక్తిగత భద్రతా  పరికరాలు (పిపిఈ), శానిటైజర్లు మన రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్ల( డాక్టర్లు, నర్సులు, మెడికల్ పారా మెడికల్ సిబ్బంది, పోలీస్, పారిశుద్య కార్మికులు, రెవిన్యూ అధికారు ఇతర ఉద్యోగులకు)కు అందుబాటులో లేకపోవడం గమనార్హం. నాసిరకం మరియు ప్రమాణాల్లేని పిపిఈలు, శానిటైజర్ల వల్ల ఫ్రంట్ లైన్ వారియర్ల ప్రాణాలకే ప్రమాదం పొంచివుంది. కోవిడ్ బాధితులను కాపాడబోయి వారే కోవిడ్ బాధితులుగా మారతారు.  రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పిపిఈలు మరియు శానిటైజర్ల నాణ్యతా ప్రమాణాలపై మార్గదర్శకాలను ఖరారుచేసి, వాటిని ఫ్రంట్ లైన్ వారియర్లు అందరికీ అందుబాటులో ఉంచాల్సిన  విపత్కర సమయం ఇది. అప్పుడే మన ఫ్రంట్ లైన్ వారియర్లను మనం కోవిడ్ బారి నుంచి కాపాడుకోగలం. 
ధన్యవాదములతో 
నారా చంద్రబాబు నాయుడు


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జులైలో కోడిమి జర్నలిస్ట్ కాలనీ ప్రారంభం : మచ్చా రామలింగా రెడ్డి
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
విజయవాడ ఏపీ కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ కామెంట్స్.. ఓవైపు రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి జగన్ కు కనిపించడం లేదా ముఖ్యమంత్రి జగన్ వారానికి ఒకటి...రెండు రోజులు స్కూల్ పెట్టడం ఏంటి ముఖ్యమంత్రి జగన్ బాద్యతారాహిత్యానికి ఇది నిదర్శనం పసిపిల్లల ప్రాణాలతో జగన్ ఆటలాడుకుంటున్నారు పిల్లలకు కరోనా సోకితే ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కితీసుకోవాలి
Image
*వింజమూరు చెన్నకేశవస్వామికి ఆభరణం బహూకరణ* వింజమూరు, జూన్ 25 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): వింజమూరులోని యర్రబల్లిపాళెంలో పురాతన చరిత్రను సంతరించుకున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి వారికి నడిమూరుకు చెందిన భక్తులు గురువారం నాడు బంగారు తాపడంతో చేసిన వెండి కిరీటమును, స్వామి అమ్మవార్లుకు పట్టు వస్త్రాలను బహూకరించారు. నడిమూరులో కీ.శే. యల్లాల.చినవెంకటరెడ్డి-ఆయన ధర్మపత్ని పుల్లమ్మల జ్ఞాపకార్ధం వారి కుమారులు యల్లాల.శ్రీనివాసులురెడ్డి, యల్లాల.రఘురామిరెడ్డి, యల్లాల.వెంకటరామిరెడ్డిలు కుటుంబ సమేతంగా దేవస్థానంకు చేరుకుని ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు గణపం.వెంకటరమణారెడ్డి, గణపం.సుదర్శన్ రెడ్డి ల సమక్షంలో దేవదేవేరునికి అలంకరణ నిమిత్తం పూజారులకు అందజేశారు. ఈ సందర్భంగా లోక కళ్యాణార్ధం ప్రజలందరూ పాడిపంటలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని అర్చకులు రంగనాధస్వామి, వెంగయ్య పంతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు అనిల్, భరత్, పునీత్, ఆశ్రిత్, ఫన్నీ, విరాజిత, రిత్విక తదితరులు పాల్గొన్నారు.
Image