జర్నలిస్ట్ హక్కుల సాధనకై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియ చేయండి
రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సోదరా కదులు - కదిలించు
👉జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరసనలు, దీక్షలు చేయండి.
👉రేపు అన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేయండి.
👉జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ, భీమా అమలు చేయాలి.
👉మచ్చా రామలింగారెడ్డి, జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (IJU) పిలుపు.
____________________________
👉రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టుల సమస్యలపై నిరసన వ్యక్తం చేయాలని మచ్చా రామలింగారెడ్డి జాతీయ సభ్యులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) పిలుపునిచ్చారు.
👉మీ.. మీ ప్రాంతాల్లో జర్నలిస్టు డిమాండ్లపై ఫ్లాకార్డు పట్టుకొని నిరసన వ్యక్తం చేయాలని తెలిపారు.
👉ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందరూ ఐకమత్యంతో నిరసన వ్యక్తం చేయాలని కోరారు యూనియన్లకు అతీతంగా అందరూ కలిసి పోరాడాలని కోరారు.
👉బయటికి రాలేని వారు మీ ఇంట్లోనే కూర్చొని మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ కార్డుని పట్టుకొని నిరసన తెలియజేయాలని కోరారు.
👉కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని కోరారు.
👉రాజధాని ప్రాంతంలో ఉన్న జర్నలిస్టులు ఎంపీ, మంత్రులు, MLA లు, అధికారుల సమావేశాలకు వెళ్ళినప్పుడు జర్నలిస్టులు మన డిమాండ్స్ ఫ్లాకార్డ్స్ ప్రదర్శించాలని కోరుతున్నాము.
👉బయట ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసే జర్నలిస్టులు తప్పకుండా సామాజిక దూరం పాటించి, మాస్కులు ధరించి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నాం.
👉మనం పోరాడకపోతే.. నిరసన వ్యక్తం చేయకపోతే.. మన సమస్యలు సమస్యగానే ఉండే ప్రమాదం ఉంది.. మిత్రులారా...
ఆలోచించండి
పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.
___________________________
*జర్నలిస్టుల డిమాండ్స్*
*జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ఇన్సూరెన్స్ ప్యాకేజిని అమలు చేయాలి.*
*కోవిడ్ విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు, N95 మాస్కులను అందజేయాలని*
*జర్నలిస్టులకు 5 వేల రూపాయలు జీవనభృతి అందజేయాలి*
*జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేయాలి*
*జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించాలి*
💎A.P. JOURNALIST DEVELOPMENT SOCIETY💎