కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ విస్తృతంగా జరగాలి: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ

తేది : 30.04.2020
అమరావతి


*రెడ్ మరియు ఆరెంజ్ జోనల్లో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయండి*


*మే 3వరకూ లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలి*


*గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభం కావాలి*


*వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తు.చా తప్పక పాటించండి*


 *కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ విస్తృతంగా జరగాలి: కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ*


అమరావతి,30ఏప్రిల్:రెడ్ మరియు ఆరెంజ్ జోనల్లో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.కరోనా నియంత్రణ చర్యలపై గురువారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా రాజీవ్ గౌబ మాట్లాడుతూ ముఖ్యంగా కొవిడ్-19 పరిస్థితి మరియు కంటైన్మెంట్ ప్రణాళికల అమలు ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జిల్లాలుగా విభజన అజెండాగా ఈ వీడియో సమావేశం నిర్వహించారు.మే 3వరకూ లాక్ డౌన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలన్నారు.వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను తుఃచా తప్పక పాటించాలని సిఎస్ లను ఆదేశించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించే ప్రక్రియ విస్తృతంగా జరగాలని చెప్పారు.దేశవ్యాప్తంగా సరుకు రవాణా వాహనాలకు అనుమతించినందుకు వాటి విషయంలో ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కంటైన్మెంట్ జోన్లు లో లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని సిఎస్ లకు స్పష్టం చేశారు.అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని గ్రీన్ జోన్లు లో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభం అయ్యేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు.21 రోజుల వ్యవధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకుంటే ఆలాంటి జిల్లాను గ్రీన్ జిల్లాగా గుర్తించి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఆదే విధంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య, పరీక్షల నిర్వహణ,కేసులు రెట్టింపు అవుతుండడం, సర్వే లెన్స్ ప్రక్రియ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆరెంజ్,రెడ్ జిల్లాలుగా వర్గీకరణ చేయాల్సి ఉందని దానిపై రాష్ట్రాలు వివరాలు సూచనలు ఇవ్వాలని వాటిని బట్టి ఆరెంజ్,రెడ్ జిల్లాల విభజనపై మార్గదర్శకాలను జారీ చేయడం జరుగుతుందని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ పేర్కొన్నారు.


ఈవీడియో సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ ప్రస్తుతం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే  రాష్ట్రంలో 4 జిల్లాలు రెడ్ జిల్లా లుగాను,8 జిల్లాలు ఆరెంజ్  జిల్లాలు కేటగిరీ,ఒక జిల్లా గ్రీన్ జిల్లా కేటగిరీ కిందకు వస్తాయి యని వివరించారు‌.మే 3 వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబకు వివరించారు.


 ఈవీడియో సమావేశంలో సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు