కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.40 లక్షల విరాళాన్ని అందించి ..ఆదర్శంగా నిలిచిన కర్నూలు జిల్లా ఎస్ హెచ్ జి మహిళలు


కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.40 లక్షల విరాళాన్ని అందించి ..ఆదర్శంగా నిలిచిన కర్నూలు జిల్లా ఎస్ హెచ్ జి మహిళలు


డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, 4 లక్షల మంది ఎస్ హెచ్ జి మహిళలను అభినందించిన కలెక్టర్ వీరపాండియన్


కర్నూలు, ఏప్రిల్16:.(అంతిమ తీర్పు) :              కర్నూలు జిల్లా కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు *రూ.40 లక్షల విరాళాన్ని* గురువారం నాడు కలెక్టరేట్ లో కలెక్టర్ వీరపాండియన్ కు డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి ఆధ్వర్యంలో అందించి.. ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలు చెప్పిన సామెతను నిజం చేసి..రాష్ట్రంలో ఉన్న మొత్తం ఎస్ హెచ్ జి మహిళలకు ఆదర్శంగా నిలిచారు కర్నూలు జిల్లా వైఎస్సార్ క్రాంతి పథం స్వయం సహాయక సంఘాల మహిళలు.


ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఇచ్చిన స్ఫూర్తితో కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి ..మేము సైతం ..అంటూ జిల్లాలో గ్రామ గ్రామాన ఉన్న దాదాపు 4 లక్షల మంది వైఎస్సార్ క్రాంతి పథం స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పొదుపు నుండి ఒక్కొక్కరు 10 రూపాయలను స్వచ్చందంగా విరాళంగా ఇచ్చిన మొత్తం 40 లక్షల రూపాయల విరాళపు చెక్కును కర్నూలు జిల్లా కలెక్టర్ కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం గురువారం నాడు  కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ శ్రీ జి.వీరపాండియన్ గారికి  జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పి.లక్ష్మీదేవి, డిఆర్డీఏ పిడి ఎం.కే.శ్రీనివాసులు, ఆదనపు పిడి శ్రీధర్ రెడ్డి తదితరులు అందించారు. 


జిల్లాలో వైఎస్సార్ క్రాంతి పథం లో సభ్యులుగా ఉన్న వారిలో దాదాపు 4 లక్షల మంది ఎస్. హెచ్. జి .మహిళలు పైసా పైసా పొదుపు చేసుకుని 40 లక్షల రూపాయలను  కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వడం కర్నూలు జిల్లా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని ...కర్నూలు జిల్లాలో కరోనా కట్టడికి జిల్లా ప్రజలందరూ చేస్తున్న సమైఖ్య కృషికి ఇది నిదర్సనం అని డిఆర్డీఏ పిడి శ్రీనివాసులును, వైఎస్సార్ క్రాంతి పథం జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి ని..4 లక్షల మంది ఎస్ హెచ్ జి మహిళలను కలెక్టర్ వీరపాండియన్ అభినందిస్తూ ..ధన్యవాదాలను తెలిపారు


అలాగే, కర్నూలు జిల్లాలో కరోనా కట్టడి కోసం ఒక కోటి క్లాత్ మాస్కులను వైఎస్సార్ క్రాంతి పథం మహిళలు జిల్లా వ్యాప్తంగా కుడుతున్నట్లు డిఆర్డీఏ పిడి శ్రీనివాసులు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీదేవి జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కు వివరించారు. 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు