అమరావతి
27.4.2020
నేడు వాటర్ గ్రిడ్ టెండర్ లపై
నిర్మాణ సంస్థలతో తాగునీటి సరఫరా కార్పోరేషన్ అధికారుల చర్చలు
హైబ్రిడ్ యాన్యుటి విధానంలో వాటర్ గ్రిడ్ టెండర్లు
హైబ్రిడ్ యాన్యుటీ విధానం ద్వారా పనులు చేపట్టే కాంట్రాక్టర్ కు ఆ పని నిర్మాణానికయ్యే మొత్తంలో నామమాత్రపు మొత్తాన్ని ఇప్పుడు చెల్లిస్తారు.
మిగిలిన మొత్తాన్ని సాధారణ బ్యాంక్ వడ్డీతో లేదా అంతకంటే తక్కువ వడ్డీరేటుతో 10-12 ఏళ్ల పాటు ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తుంది.
ఈ విధానంలో టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన అదానీ ఎంటర్ ప్రైజెస్, వెలస్ పన్ -జీవీపీఆర్ కన్సార్టియం, వేగాస్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సీసీ లిమిటెడ్, గాయత్రి ప్రాజెక్టస్ లిమిటెడ్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిలి), రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ సంస్థలు...
తొలివిడతలో రూ.12,308 కోట్లతో 6 జిల్లాల్లో చేపట్టనున్న పనులు
రాష్ట్రంలో వచ్చే 30 ఏళ్ల పాటు ప్రజల అవసరాలను తీర్చే విధంగా రూ. 57,622 కోట్లతో ప్రతిష్టాత్మకంగా భారీ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసిన ప్రభుత్వం