కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై ముఖ్యమంత్రి అరా

*30.04.2020*
*అమరావతి*


*అమరావతి: కరోనాపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష


కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడంపై సమావేశంలో చర్చ.ఇది చాలా అమానవీయమని పేర్కొన్న సమావేశం.కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు: సీఎం.


అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితే రావొచ్చు : సీఎం


అంటరాని వాళ్లుగా చూడ్డం కరెక్టుకాదు :సీఎం


అలాంటి పరిస్థితుల్లో వారిమీద ఆప్యాయత, సానుభూతి చూపించాల్సింది పోయి వివక్ష చూపడం కరెక్టుకాదు:


అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు:


అడ్డుకున్న వారిలో ఎవరికైనా రావొచ్చు:


మనకే ఇలాంటివి జరిగితే.. ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి:


బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు అడ్డుకోవడం సరికాదు:


ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీకి సూచించిన సీఎం


కరోనా వస్తే.. మందులు తీసుకుంటే.. అది పోతుంది:కరోనా వచ్చిన వారిని అంటరాని వారిగా చూడ్డం సరికాదు:తప్పుడు ప్రచారాలను ప్రోత్సహించినట్టు అవుతుంది:కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కేసులుకూడా పెట్టొచ్చు: అధికారులుకరోనా వస్తే అది భయానకమనో, అది సోకినవారిని అంటరాని తనంగా చూడ్డం సరికాదు:కరోనా అన్నది సోకితే , మందులు తీసుకుంటే పోతుంది:రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది డిశ్చార్జి అవుతున్నారు?:


నయం అయితేనే కదా... డిశ్చార్జి అయ్యేది?:తప్పుడు ప్రచారాలు చేసి లేనిదాన్ని సృష్టించే ప్రయత్నంచేయొద్దు : సీఎం.దేశవ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26శాతం అంటే.. మిగతా వాళ్లు డిశ్చార్జి అవుతున్నట్టే కదా?:అదికూడా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతుంది:


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు