కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !

AP FIGHTS COVID 19.
COMMAND CONTROL
*****************************
యుద్దం లో సైనికులు!! 


కొవిడ్ యుద్దం లో పరీక్ష చేసే వైద్యసిబ్బంది !!! 


కరోనా పరీక్ష నిమిత్తము రాష్ట్ర ప్రభుత్వము 7 RTPCR/VDRL లాబ్ లను నెలకొల్పింది. 


వీటితోపాటు ట్రునాట్ ల్యాబ్, Chemilucency లాబ్  లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కో వి డ్ పరీక్షలు నిమిత్తమై ఏర్పాటు చేశారు తద్వారా ఈనాడు రోజుకి ఆరు వేల పైచిలుకు శాంపిల్స్ను పరీక్ష చేయగలుగుతున్నాము దేశంలోనే మన రాష్ట్రం పరీక్షల విషయంలో అగ్రగామిగా నిలిచింది.


ఇందులో రాష్ట్రవ్యాప్తంగా వచ్చినటువంటి శాంపుల్ లను పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు పాజిటివ్ గా లేదా నెగిటివ్ అని


ఒక్క విజయవాడలోనే రమారమి రోజుకు వెయ్యి శాంపుల్ టెస్ట్ చేసే సామర్థ్యము కలదు. 


ఈ ల్యాబ్ లో ఎక్కువశాతం పాజిటివ్ ఉన్న శాంపిల్స్ను ఎగ్జామ్ చేయటంలో ధైర్యంగా సాహసోపేతంగా రాత్రింబవళ్ళు వైద్య సిబ్బంది పని చేస్తున్నారు.


చిన్న పొరపాటు జరిగితే వారికి ఈ వైరస్ సోకుతుంది.  హైరిస్క్ ప్రదేశంలో ఉండి ప్రజల యొక్క క్షేమం గురించి రేయింబవళ్ళు తమకు రిస్కు ఉన్నది అని తెలిసినా కూడా చిరునవ్వుతో దేహం అంతా personal protective equipment తో పూర్తిగా కప్పుకొని ఎంతో ధైర్యంతో ఈ టెస్ట్లను నిర్వహిస్తూ ఉంటారు.


ఒక కరోనా పాజిటివ్ కేసు ఉన్నది అంటేనే ఆ ఇల్లు ఆ చుట్టుపక్కల వారు గడగడలాడి పోతూ ఉంటారు. అలాంటిది ఇది ప్రతి శాంపుల్ లో వైరస్ ఉంది/  ఉంటుంది అని తెలిసి కూడా మనోధైర్యంతో హైరిస్క్ జోన్లో పని చేస్తున్నటువంటి ఈ వైద్య సిబ్బందికి మనమందరం ఎంతైనా రుణపడి ఉన్నాము.


ఈరోజు ఈ లేబరేటరీలో  రేయింబవళ్ళు గత ముప్పై తొమ్మిది రోజులుగా అలసట లేకుండా బాహ్య ప్రపంచంతో  సంబంధం లేకుండా పనిచేస్తున్న వీరందరిని చూసిన తర్వాత 


 ప్రతినిత్యం కుటుంబం కంటే సమాజ సేవే ముఖ్యం అని వీరు చెప్తుంటే ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క రూ యుద్ధములో శత్రువు ని ఎదిరుస్తున్న వీర సైనికుడు లాగా కనిపిస్తున్నారు.


క రోనా పైన ప్రత్యక్షంగా ముందుండి తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వీరందరికీ మన అందరి తరపున కృతజ్ఞతలు ధన్యవాదాలు!!! 


మనందరం భౌతిక దూరాన్ని పాటిస్తూ ఇంటిలో ఉండటమే మనం వీరందరికీ ఇవ్వగలిగిన నిజమైన కృతజ్ఞతాభివందన ములు!!  
___________________________
డాక్టర్ అర్జా శ్రీకాంత్ 
Covid స్టేట్ నోడల్ ఆఫీసర్


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు