గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్ కి 7 కి.మీ వెలుపల ఉన్న అన్ని పరిశ్రమలు నిర్వహించుకోవచ్చు

 


     *నెల్లూరు, 30-04-2020*


లాక్ డౌన్ నిబంధనల వలన జిల్లాలో నిన్నటి వరకు పరిశ్రమల నిర్వహణకు కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని.., దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల నిర్వహణకు సంభందించిన నిబంధనలను సవరించిందని డి.ఐ.సి. జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.


 నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన డి.ఐ.సి. జనరల్ మేనేజర్... గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్ కి 7 కి.మీ వెలుపల ఉన్న అన్ని పరిశ్రమలు నిర్వహించుకోవచ్చన్నారు. పరిశ్రమల యజమానులు రాష్ట్ర పరిశ్రమల శాఖ వెబ్ సైట్  ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని.., కమిటీ సభ్యులు దరఖాస్తులు పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారన్నారు.


 నెల్లూరు జిల్లాలో కీలకమైన కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని.., ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కలెక్టర్ యం. వి.శేషగిరి బాబు.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో.., 
కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు, పవర్ ప్రాజెక్ట్స్ నిర్వహణకు ప్రభుత్వం  ప్రత్యేక అనుమతులు మంజూరు చేసిందన్నారు
గతంలో గ్రీన్ జోన్ మండలంలో పరిశ్రమ ఉంటే, ఆ మండలంలోని కార్మికులు మాత్రమే ఆ పరిశ్రమలో పనిచేయడానికి అనుమతి ఉండేదని.., ప్రస్తుతం మాత్రం గ్రీన్ జోన్ మండలంలో ఉండే పరిశ్రమలో.., సమీపంలోని ఇతర గ్రీన్ జోన్ మండలాల వారు కూడా పనిచేయవచ్చన్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీ పరిధిలోని పరిశ్రమల నిర్వహణకు గతంలో ఉన్న నిబంధనలు అమల్లో ఉంటాయని, వీటికి మాత్రం ఎలాంటి ప్రత్యేక అనుమతులు కల్పించలేదని డి.ఐ.సి. జనరల్ మేనేజర్ ప్రసాద్ వెల్లడించారు.
 


Popular posts
షాంపూ, ఫేస్ మాస్క్, సానిటయిజర్ లు పంపిణీ
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
వెల్లివిరిసిన వనిపెంట.సుబ్బారెడ్డి దాతృత్వం
*పీఎంవోలోకి ఆమ్రపాలి* న్యూఢిల్లీ : యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి మరో అరుదైన అవకాశం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో)లో తాజాగా నియమితులైన ముగ్గురు ఐఏఎస్‌ల జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమితులైన ఆమ్రపాలి 2023 అక్టోబర్‌ 27వరకు కొనసాగనున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా రఘురాజ్‌ రాజేంద్రన్‌, అండర్‌ సెక్రటరీగా మంగేశ్‌ గిల్దియాల్‌ను నియమిస్తూ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ది కేబినెట్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2010 బ్యాచ్‌ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి గతంలో వికారాబాద్‌ సబ్‌ కలెక్టర్‌గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్‌ జిల్లా కలెక్టర్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌ సెక్రటేరియట్‌లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అలాగే, పీఎంవోలో డైరెక్టర్‌గా నియమితులైన రఘురాజ్‌ రాజేంద్రన్‌ మధ్యప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన (2004 బ్యాచ్‌) ఐఏఎస్‌ అధికారి. ఆయన గతంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేశారు. మరోవైపు, 2012 బ్యాచ్‌కు చెందిన ఉత్తరాఖండ్‌ క్యాడర్‌ అధికారి మంగేశ్‌ గిల్దియాల్‌ పీఎంవో అండర్‌ సెక్రటరీగా నియమితులయ్యారు.
Image
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు