కరోనా వైరస్ నశించాలని శివలింగ పూజలు చేసిన వీరశైవ లింగాయత్ లు
ఎమ్మిగనూర్,ఏప్రిల్,14 (అంతిమతీర్పు):- ఎమ్మిగనూరు మండలం పరిధిలోని కే. తిమ్మాపురం గ్రామం లో మంగళవారం ఉదయం 11గంటలకు ఎమ్మిగనూరు తాలూకా వీరశైవ లింగాయతల సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బి. సి. నాగరాజు మాట్లాడుతూ యావత్ ప్రపంచాన్ని, ప్రజల్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారినీ సమూలంగా నాశనం కావాలని, ఈ వైరస్ బారిన పడి అనారోగ్యం పాలై మరణాలు సంభవిస్తున్నాయి అని తెలిపారు.కరోనా వైరస్ రోగులు త్వరగా కోలుకోవాలని జగద్గురువుల ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 7గంటలకు కే.తిమ్మాపురం గ్రామంలో ఉన్న ఉమా మహేశ్వర దేవాలయం నందు భోళాశంకరుడినీ కోరుతూ వీరశైవ లింగాయతులందరూ సామూహిక ఇష్టలింగ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు.ఇప్పటికైనా మన రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న covid 19 వైరస్ వల్ల చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసి కలిసిపోకుండా ఆ భగవంతుడైన శివపరమాత్మ డే కాపాడాలని వీరశైవ లింగాయత్ లు కోరుతున్నారు.ఇప్పటికైనా మన భారతదేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య పాజిటివ్ కేసులు గా లేనట్లు చూడాలని ఆ శివపరమేశ్వరుని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవలింగాయత్ లందరూ, అలాగే గ్రామ పెద్దలు,భారీ సంఖ్యలో హాజరు కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా భారతదేశానికి శాంతి చేకూరాలని వీరశైవ లింగాయత్ లు అందరూ కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ వీరశైవ లింగాయత్ అధ్యక్షులు బసన్న, కార్యదర్శి పెద్ద రామలింగప్ప, సలహాదారు హోటల్ రామలింగప్ప, డాక్టరు మల్లేషప్ప, శివ, బద్రి తదితరులు పాల్గొన్నారు.