విలేకరులకు కరోనా టెస్టులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్,పోలీసు కమిషనర్, వి ఎం సి కమిషనర్, లు చొరవ చూపాలి..........
యేమినేని వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి వినతి
విజయవాడ....ఏప్రిల్ 22 ( అంతిమ తీర్పు); విజయవాడ నగరంలో కరోనా మహమ్మారి అంచెలంచెలుగా విజృంభిస్తున్న తరుణంలో విధి నిర్వహణలో ఉన్న విలేకరులకు కరోనా టెస్టులను నిర్వహించాలి
విలేకరులందరూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు సమాచారాన్ని చేరవేయాలని నిత్యం వార్తల సేకరణలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తమ విధులను నిర్వహిస్తూ ప్రజాప్రతినిధుల కార్యక్రమాలను సేకరిస్తూఉంటారు
.కరోనా మహమ్మారి కారణంగా ఒక్క పక్క తమను తాము కాపాడుకుంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ వార్తల సేకరణలో నిమగ్నమయ్ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
అందుకు ఉదాహరణ ముంబాయి లో 6గురు విలేకరులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అవడమే
.ఈ విషయమై అప్పటికప్పుడు ప్రభుత్వం కదిలి విలేకరులకే కాకుండా ప్రజాప్రతినిధులకు,కార్యకర్తలకు కరోనా పాజిటివ్ టెస్టులు నిర్వగించాలి కరోనా వలన ముంబాయ్ నగరం గందరగోళంగా మారింది.
ముంబాయి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాకుండా ముఖ్యంగా కార్యక్రమాలు ఎక్కువుగా జరిగే పట్టణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధుల కార్యక్రమాలలో పాల్గొటుంన్న విలేకరులకు ముందస్తు కరోనా పరీక్షలు నిర్వహిస్తే ఎటువంటి సమస్యలు ఉండవని విలేకరులు భావిస్తున్నారు.
ఒక విలేకరికి కరోనా పాజిటివ్ వచ్చినా మిగిలిన విలేకరులకు రాదని నమ్మకం లేదు విధి నిర్వహణలో వార్తలను,ఫొటోలను,వీడియోలను ఒకరి నుంచి ఒకరు పంచుకుంటారు.అంతేకాక ప్రజాప్రతినిధులతో,ప్రజలతో మమైకంగా ఉంటారు.
ఎటువంటి అత్యవసర పరిస్థితి అయినా అధికారులతో పాటు వార్తల సేకరణ కోసం పరుగులు తీస్తుంటారు.ఇలాంటి నేపధ్యంలో ప్రజాప్రతినిధులు స్పందించి విలేకరులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే విలేకరుల కుటుంబాలకే కాకుండా సమాజానికి మేలుచేసిన వారవుతారు.
వార్తలు సేకరణలో భాగంగా విలేకరులు ముందు వెనకా ఆలోచించకుండా బ్రేకింగ్ న్యూస్ కోసం పరుగులు తీస్తున్నారు ...
పోలీసులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు సిబ్బంది, కరోనా నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను గ్యాప్ లేకుండా నిరంతరం ప్రజల్లోకి వార్తలు చేరవేస్తున్న విలేకరులు ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
విలేకరుల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలో, నగరంలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, విలేకరుకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నాను
ఈ విషయంలో మంత్రులు ,ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొంటే రాష్ట్రంలో వేలాదిమంది విలేకరుల కుటుంబాలను ఆదుకొన్నవారవుతారు ...యేమినేని వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి .....